Chhath Puja: చాత్ పూజ చేస్తుండగా కూలిన కల్వర్టు… నీటిలో పడిపోయిన భక్తులు.. తప్పిన ప్రమాదం

చాత్ పూజ సందర్భంగా నీటిలో తర్పణం వదులుతుండగా ఒక కల్వర్టు కూలిపోయింది. ఈ ఘటనలో కల్వర్టుపై ఉన్న చాలా మంది నీటిలో పడిపోయారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు.

Chhath Puja: ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. చాత్ పూజ సందర్భంగా కల్వర్టుపై జనం గుమిగూడి ఉండగా, ఉన్నట్లుండి కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు నీటిలో పడిపోయారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని

ఉత్తర ప్రదేశ్, చందౌలి జిల్లా, సరైయా అనే గ్రామంలో సోమవారం ఉదయం ఘనంగా చాత్ పూజ నిర్వహిస్తుంగా ఈ ఘటన జరిగింది. చాత్ పూజలో భాగంగా గ్రామస్తులు నీటిలో తర్పణం వదిలేందుకు పెద్ద ఎద్దున దగ్గర్లోని చిన్న కాలువ దగ్గరకు చేరుకున్నారు. ఈ తంతు చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కొందరు కాలువలోని నీటిలో తర్పణం వదులుతుంటే, ఇంకొందరు అక్కడే ఉన్న కల్వర్టుపై నిలబడి చూస్తున్నారు. అయితే, ఉన్నట్లుండి కల్వర్టులోని ఒకవైపు కూలిపోయింది. దీంతో కల్వర్టుపై ఉన్న చాలా మంది నీటిలో పడిపోయారు. వీరిలో ఆరుగురికి గాయాలయ్యాయి. అయితే, లోతు తక్కువగా ఉండటం, పక్కనే చాలా మంది ఉండటంతో నీళ్లలో పడ్డవారిని వెంటనే రక్షించగలిగారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ గందరగోళం నెలకొంది. స్థానికులు వెంటనే స్పందించి అందరినీ రక్షించారు.

Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో నలుగురి అరెస్టు.. కొనసాగుతున్న విచారణ

ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తకుండా చూశారు. కాగా, ఈ కల్వర్టు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించింది. నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో కొంతకాలం నుంచి స్థానికులు వాడటం లేదు. కానీ, చాత్ పూజ సందర్భంగా స్థానికులు దీనిపై నిలబడి చూస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని స్తానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు