PM Narednar Modi: 23న అయోధ్యలో 15లక్షల మందితో దీపోత్సవ వేడుక.. పాల్గోనున్న ప్రధాని మోదీ..

ప్రతీయేటా దీపావళికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ వెలుగుల పండుగని నిర్వహిస్తోంది. దీనిలో ప్రజలు అయోధ్యలోని నదీతీరంలో 'ద్వీపాలతో' వరుసలో ఉంటారు. గత ఏడాది తొమ్మిది లక్షల మందితో రికార్డు నెలకొల్పగా.. 23న 15లక్షల మందితో చారిత్రాత్మక ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యూపీ పర్యాటక శాఖ కృషి చేస్తుంది.

PM Narednar Modi: అక్టోబర్ 23న జరిగే దీపోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య వెళ్లనున్నారు. సరయూ నది ఒడ్డున నెలకొని ఉన్న రామ్‌కీ పైడి ఘాట్‌ల శ్రేణిలో దీపోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. తద్వారా అయోధ్యలోని భక్తుల సమక్షంలో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ప్రతీయేటా దీపావళికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ వెలుగుల పండుగని నిర్వహిస్తోంది. దీనిలో ప్రజలు అయోధ్యలోని నదీతీరంలో ‘ద్వీపాలతో’ వరుసలో ఉంటారు.

Vehicle Theft: దేశంలో ఎక్కువ వాహన దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా..? సేఫ్‌‌ప్లేస్‌లో హైదరాబాద్‌

అయోధ్యలో దీపోత్సవ సంప్రదాయం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. 2017లో 51వేల మంది దివ్యాంగులతో ప్రారంభమై, 2019లో 4.10 లక్షలకు, 2020లో ఆరు లక్షలకుపైగా, గత ఏడాది తొమ్మిది లక్షలకు పైగా చేరి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది దాదాపు 15లక్షల మందితో మళ్లీ చారిత్రాత్మక ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ ట్వీట్ చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మోదీ అయోధ్య పర్యటన ఇలా..

అక్టోబర్ 23న సాయంత్రం 4.55 గంటలకు శ్రీ రామ జన్మభూమిలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్‌మన్‌కు ప్రధాని మోదీ ప్రార్ధనలు చేస్తారు. 5.05 గంటలకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర స్థల పరిశీలించి, దర్శనం చేసుకుంటారు. 5.40గంటలకు శ్రీ రామ్ కథా పార్కులో నిర్వహించే శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 6.25గంటలకు సరయు కొత్త ఘాట్ వద్ద హారతిలో పాల్గొంటారు. 6.40 గంటలకు రామ్ కీ పైడిలో జరిగే దీపోత్సవ్‌లో ప్రధాని పాల్గొంటారు. రాత్రి 7.25 గంటలకు సరయు కొత్త ఘాట్ వద్ద గ్రీన్ డిజిటల్ బాణసంచాని ప్రధాని మోదీ వీక్షిస్తారు.

ట్రెండింగ్ వార్తలు