Gyanvapi Case: శివలింగం జాగ్రత్త, నమాజ్ ఆపకండి – జ్ఞానవాపి అంశంలో సుప్రీం ఆదేశం

జ్ఞానవాపి మసీదు సర్వే కేసులో వాదనను గురువారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. మసీదు ఆవరణలో దొరికిన శివలింగాన్ని కాపాడుతూ.. ముస్లింలు ప్రార్థన చేసే హక్కుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ కు ఆదేశాలిచ్చింది.

 

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు సర్వే కేసులో వాదనను గురువారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. మసీదు ఆవరణలో దొరికిన శివలింగాన్ని కాపాడుతూ.. ముస్లింలు ప్రార్థన చేసే హక్కుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ కు ఆదేశాలిచ్చింది.

“అక్కడ శివలింగం ఉన్నట్లయితే, జిల్లా మెజిస్ట్రేట్ దానిని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆ కారణంగా ముస్లింలు ప్రార్థన చేసుకునే హక్కుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి” అని సుప్రీం కోర్టు పేర్కొంది.

శివలింగం కనిపించిందని తెలిశాక వారణాసి కోర్టు ఆ ప్రదేశాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరూ వెళ్లకూడదని ఆర్డర్ వేసిన దానిపై సుప్రీం కోర్ట్ స్పందించింది. శివలింగం బయటపడ్డ భాగం వరకూ మాత్రమే ఆ ఆదేశం వర్తిస్తుందని యూపీ ప్రభుత్వానికి, పిటిషనర్లకు నోటీసులు ఇష్యూ చేసింది టాప్ కోర్ట్.

Read Also: జ్ఞానవాపి మసీదు సర్వే విషయంలో ట్విస్ట్, రెండ్రోజులే గడువిచ్చిన కోర్టు

కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి 16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు మసీదు నిర్మాణం చేశారంటూ సుప్రీం కోర్టులో, అలహాబాద్ హైకోర్టులో, వారాణాసి కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.

పిటిషనర్లు, స్థానిక పూజారులు జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వారణాసి కోర్టులో 1991లో తొలి పిటిషన్ దాఖలైంది.

వారణాసికి చెందిన విజయ్ శంకర్ రస్తోగి అనే న్యాయవాది జ్ఞానవాపి మసీదు నిర్మాణంలో చట్టవిరుద్ధమని పేర్కొంటూ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మసీదు నిర్మాణంపై వివరణ వచ్చేలా పురావస్తు శాఖ సర్వే నిర్వహించాలని కోరారు. ఇది డిసెంబర్ 2019లో అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి టైటిల్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు