Cm Stalin : టమాటా ధరల కట్టడికి సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం..మార్కెట్ లో దిగివచ్చిన ధరలు

టమాటా ధరల కట్టడికి సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకన్నారు. తక్షణమే చర్యలు చేపట్టారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ లో కూడా టమాట ధరలు దిగివచ్చాయి.

Cm Stalin Govt Steps To Sell Tomatoes At Lower Rates : టమాటా పేరు చెబితేనే హడలిపోతున్న పరిస్థితి. పెట్రోల్ కంటే ఫాస్టుగా పరిగెడుతోంది టమాటాల ధర. దీంతో వంటల్లో టమాటా జాడే కనిపించట్లేదు. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలీ టమాటా రూ.150 అమ్ముతోంది. దీంతో జనాలు టమటాలవైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఈ క్రమంటో టమాటాల ధరల్ని కట్టడి చేయటానికి సామాన్యలకు కూడా టమాటాలను అందించాలని సీఎం ఎంకె స్టాలిన కీలక నిర్ణయం తీసుకున్నారు.

టమాట ధరల కట్టడికి స్టాలిన్ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి అమ్మేలా చర్యలు చేపట్టారు. ఓ పక్క భారీగా కురుస్తున్న వర్షాలు..మరోపక్క పెరిగిన పెట్రోల్ ధరలతో..ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా పెరిగాయి. దీనికి తోడు వర్షాల వల్ల టమాటాల పంట దెబ్బతింది. దీంతో దిగుమతికూడా తగ్గడంతో టమాట ధరలకు రాత్రికి రాత్రే రెక్కలు వచ్చినట్లైంది. కొన్ని రోజుల క్రితం వరకు కిలో టమాట రూ.10 నుంచి 20 అమ్మితే హఠాత్తుగా ఒకేసారి రూ.100కు చేరుకుంది. అలా రూ.100 కూడా దాటేసింది.

Read more : Petrol-Tomato Prices : పెట్రోల్, టమాటా ధరల రన్నింగ్ రేస్..చుక్కలు చూపిస్తున్నాయిగా..

ఈక్రమంలో చెన్నైలో కిలో టమాటా తమిళనాడు మార్కెట్లలో కిలో రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. ధరలు మరింత పెరగొచ్చన్న సంకేతాలతో మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. సహకారశాఖ పరిధిలో తోట పచ్చధనం దుకాణాల ద్వారా బుధవారం (నవంబర్ 24,2021)నుంచి కిలో రూ. 79కి విక్రయాలు ప్రారంభించింది. చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లోని మరో 65 దుకాణాల్లో విక్రయాలు సాగుతున్నాయి.

దీని కోసం ప్రతిరోజు 15 మెట్రిక్ టన్నుల టమోటాలను సేకరిస్తున్నామని రాష్ట్ర సహకార శాఖ ప్రకటించింది. ప్రజలకు తక్కువ ధరకు టమాటా సరఫరా చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే టమోటాలను సేకరించి కొని వాటిని ప్రజలకు తక్కువ ధరకే ఇస్తున్నామని తెలిపారు. నిన్న ఒక్కరోజు మధ్యాహ్నం వరకు..8 మెట్రిక్ టన్నుల టమోటాలు విక్రయించామని సహకార శాఖ మంత్రి ఐ పెరియసామి తెలిపారు. ప్రభుత్వమే స్వయంగా టమాటాలు అమ్మటంతో మార్కెట్ లో కూడా ధరలు దిగి వచ్చాయి.

Read more : Tomato Price : సామాన్యుడికి షాక్..కిలో టమాటా ధర.130

బహిరంగ మార్కెట్‌లో కిలో టమాట రూ. 140 ఉండగా..ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ఒక్కరోజులోనే దాదాపు రూ.కిలోకు 90-100కు దిగి వచ్చింది. అదేవిధంగా ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గాయి. ఇలా ప్రభుత్వం ఈ టమాటాల అమ్మకం కొంతకాలం పాటు కొనసాగిస్తే మొత్తం ధరలు దిగివస్తాయని అంటున్నారు ప్రజలు..వ్యాపారులు కూడా. కర్ణాటకలోని రెండు ప్రాంతాలు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల నుండి టమోటాలు లభిస్తాయని కోయంబేడు హోల్‌సేల్ వెజిటబుల్ సలహాదారు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు