Gujarat: రోడ్డు సౌకర్యం లేని ఊరు.. మోకాలి లోతు నీటిలో గర్భిణి అయిన చెల్లిని భుజాలపై మోసుకెళ్లిన అన్న

ఊరి నుంచి దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఒక అన్న.. గర్భిణి అయిన తన చెల్లిని భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు. మోకాలి లోతు నీటిలో రెండు కిలోమీటర్లు చెల్లిని ఎత్తుకుని తీసుకెళ్లాడు.

Gujarat: దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది అని చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ అనేక గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు లేని కారణంగా ఇక్కడి ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందడం కూడా కష్టమే. అందులోనూ వర్షాకాలంలో మరింత కష్టమవుతుంది. ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే మోకాలిలోతు నీళ్లలో, కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాలి. కొన్నిసార్లు అది కూడా సాధ్యం కాకపోవచ్చు.

Amit Shah: నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మునుగోడు సభకు హాజరు.. షెడ్యూల్ ఇదే..

కచ్చా రోడ్డుతోపాటు, ఊరును వరద ముంచెత్తి, చుట్టూ నీళ్లు చేరితే… ఇంక వాళ్ల కష్టాలు వర్ణించ సాధ్యం కాదు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఒక గర్భిణి కుటుంబానికి. రోడ్డు సౌకర్యం లేని కారణంగా ఒక అన్న.. గర్భిణి అయిన తన చెల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చింది. అది కూడా మోకాలి లోతు నీటిలో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఇటీవల గుజరాత్‌లోని నర్మదా జిల్లా, జర్వాని గ్రామంలో జరిగింది. జర్వాని గ్రామం మెయిన్ రోడ్డుకు రెండు కిలోమీటర్లకు దూరంగా ఉంటుంది. ఆ ఊరు నుంచి మెయిన్ రోడ్డుకు వచ్చేందుకు సరైన రోడ్డు లేదు. అంతా కచ్చా రోడ్డు. పైగా ఇటీవలి వర్షాలకు రోడ్డు మార్గం మొత్తం మోకాలి లోతు నీటితో నిండిపోయింది. ఈ పరిస్థితిలో అమిత్ వాసవ అనే వ్యక్తి, గర్భిణి అయిన తన సోదరిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది.

Uddhav Thackeray: బాల్‌థాకరే పేరుతో ఫడ్నవీస్ ఓట్లు అడుగుతున్నాడంటే.. మోదీ శకం ముగిసినట్లే: ఉద్ధవ్ థాకరే

ఆమెకు అత్యవసర వైద్యం అవసరం వచ్చింది. ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆమెను తన భుజాలపై ఎత్తుకుని, రెండు కిలోమీటర్లు నడిచాడు. ఈ విషయంలో అతడి కుటుంబ సభ్యులు కూడా సాయం చేశారు. రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత మెయిన్ రోడ్డు చేరుకున్నారు. అక్కడ్నుంచి వాహనంలో ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే, అధికారులు స్పందించారు. ఈ ఒక్క ఊరుకు మాత్రమే రోడ్డు సౌకర్యం లేదని, కొండల మధ్య ఉండటంతో రోడ్డు సాధ్యం కాలేదని ఎమ్మెల్యే చెప్పాడు. జిల్లా అధికారులు కూడా స్పందించి, త్వరలో రోడ్డు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు