Raksha bandhan 2023 : జవాన్‌లకు రాఖీలు కట్టిన మహిళలు,చిన్నారులు

రక్షా బంధన్ వేడుకలు దేశ సరిహద్దుల్లో ఘనంగా జరుగుతున్నాయి. దేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్న భారత సైనికులకు మహిళలు రాఖీ కడుతున్నారు.

Kashmir Womens Tied Rakhi to Soldiers : ఈరోజు రక్షాబంధన్ వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులకు రాఖీలు కట్టి తమ బంధాన్ని,అనుబంధాన్ని మరింత పదిల పరుచుకుంటున్నారు సోదరీమణులు. రక్షా బంధన్ వేడుకలు దేశ సరిహద్దుల్లో కూడా ఘనంగా జరుగుతున్నాయి. దేశాన్ని కంటికి రెప్పలా కాస్తున్న భారత సైనికులకు మహిళలు రాఖీ కడుతున్నారు. మీరు ఎప్పుడు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని దేశమంతా మీకు తోడుగా ఉంటుందని తెలియజేస్తు కశ్మీర్ లోను మహిళలు, చిన్నారులు జవాన్లకు రాఖీలు కట్టారు.

జమ్ము కశ్మీర్ లో మహిళలు, చిన్నారులు క్యూల్లో నిలబడి బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీలు కట్టారు. జవాన్లకు హారతి ఇచ్చి స్వీట్లు తినిపించారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్న మీకు దేశమంతా కుటుంబమేనని..తాము కూడా మీ సోదరీమణులమే అంటూ జవాన్లకు కశ్మీర్ లో మహిళలు, చిన్నారులు రాఖీలు కట్టారు. జమ్ము కశ్మీర్ తో పాటు దేశ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో మహిళలు జవాన్లకు రాఖీలు కట్టారు. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలోని జవాన్లకు మహిళలు ఆనందోత్సాహాల మధ్య రాఖీలుకట్టారు. విద్యార్ధినులు కూడా భారీగా తరలి వచ్చి రాఖీలు కట్టారు.

ట్రెండింగ్ వార్తలు