Asaduddin Owaisi: ఇందిరా పాలన తెస్తున్నారంటూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓవైసీ

రాజ్యాంగ మౌలిక వ్యవస్థపై రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విమర్శలు చేస్తున్నారు. కొలీజియం వ్యవస్థపై ఏకంగా న్యాయశాఖ మంత్రే విమర్శలు గుప్పిస్తున్నారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ బిల్లు సభకు వచ్చినప్పుడు ఈ బిల్లు రాజ్యంగ మౌలిక వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పిన ఏకైక ఏంపీని నేను.

Asaduddin Owaisi: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై అటు కేంద్రానికి ఇటు సుప్రీంకోర్టుకు మధ్య జరుగుతున్న రచ్చపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఇందిరా గాంధీ హయాం నాటి ఎమర్జెన్సీ రోజుల్ని మోదీ ప్రభుత్వం మళ్లీ తీసుకువస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా బుధవారం లోక్‭సభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక వ్యవస్థపై రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు కామెంట్లు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

PM Modi: అదానీని వదలని అపోజిషన్.. యూపీఏ స్కాంలను ఎకరువు పెట్టిన పీఎం మోదీ

”రాజ్యాంగ మౌలిక వ్యవస్థపై రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విమర్శలు చేస్తున్నారు. కొలీజియం వ్యవస్థపై ఏకంగా న్యాయశాఖ మంత్రే విమర్శలు గుప్పిస్తున్నారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ బిల్లు సభకు వచ్చినప్పుడు ఈ బిల్లు రాజ్యంగ మౌలిక వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పిన ఏకైక ఏంపీని నేను. ఇందిరాగాంధీ నుంచి మీరు పాఠాలు నేర్చుకోవాలి. జ్యూడిషియరీ నన్ను అనుసరించాలని ఇందిరా గాంధీ అన్నారు. ఇప్పడు జ్యుడిషియరీ తనకు విధేయంగా ఉండాలని ప్రధాన మంత్రి మోదీ అంటున్నారు. మీరు ఇందిరాగాంధీ శకాన్ని మళ్లీ తీసుకువస్తున్నారు” అని ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Mahua Moitra: పార్లమెంటులో బీజేపీ నేతపై అభ్యంతరకర పదం.. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనంటున్న మహువా