హైదరాబాద్‌లో రోహింగ్యాలు : ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..అడ్డుకున్నMIM నేత

  • Publish Date - February 22, 2020 / 08:59 AM IST

రోహింగ్యాలపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. వీరికి సహకరిస్తున్న ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది రోహింగ్యాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరి వద్ద ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లున్నట్లు గుర్తించారు. అంతేగాకుండా..ఇండియన్ పాస్ పోర్టులు, రేషన్ కార్డులు, బ్యాంకు అకౌంట్‌లు లభ్యమయ్యాయి.

కొందరు రోహింగ్యాలు బ్యాంకు రుణాలు సైతం తీసుకున్నట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా వాడుతున్నట్లు నిర్దారించారు. రోహింగ్యాలకు సహకరిస్తున్న ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆధారాలు సేకరిస్తున్న సమయంలో పోలీసులకు ఓ ఎంఐఎం నేత అడ్డు పడ్డారు. నేతలు అడ్డుపడితే..చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

ఇటీవలే వీరి విషయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నగరంలో ఆరు వేల మందికిపైగా రోహింగ్యాలున్నారని, వీరు ఎలా వచ్చారు ? వీరికి ఆశ్రయం కల్పించింది ఎవరు అంటూ ప్రశ్నించారు. రోహింగ్యాలపై వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం నివేదికలు తెప్పించుకొంటోందన్నారు. 

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో రోహింగ్యాలు ఆందోళన చెందుతున్నారు. తమను ఏ క్షణమైనా పంపిస్తారని వీరు బిక్కుబిక్కుమంటున్నారు. జమ్మూ కాశ్మీర్ తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధికంగా రోహింగ్యాలు ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఐబీ హెచ్చరికలతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు రోహింగ్యాలపై దృష్టి సారించారు. 

Read More : కంచె చేను మేసింది : బాలికను గర్భవతి చేసిన దిశ పీఎస్ హోం గార్డు

ట్రెండింగ్ వార్తలు