Ghulam Nabi Azad: ఎదరు చూపులకు తెర.. పది రోజుల్లో పార్టీ ప్రకటిస్తాని ఆజాద్ ప్రకటన

పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి ఎప్పుడు పెడతారు? పార్టీ పేరేంటనే విషయాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. మరో పది రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. ఆదివారం జమ్మూ కశ్మీర్‭లోని బారాముల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు.

Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సొంతంగా పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి ఎప్పుడు పెడతారు? పార్టీ పేరేంటనే విషయాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చారు. మరో పది రోజుల్లో పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. ఆదివారం జమ్మూ కశ్మీర్‭లోని బారాముల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు.

రాజీనామా చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈసారి విమర్శలకు ఆయుధాల్ని జత చేర్చారు. రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ ‘‘నా మీద వాళ్లు (కాంగ్రెస్ నేతలు) మిసైళ్లు విసిరారు. నేను కేవలం 303 రైఫిల్ మాత్రమే ఉపయోగించాను. వాళ్ల మిసైల్సన్నీ ధ్వంసమయ్యాయి. ఒకవేళ నేను బాలిస్టిక్ మిసైల్ ఉపయోగించి ఉంటే వారి పరిస్థితి ఏంటి? బహుశా ఎవరూ ఈపాటికి కనిపించకపోయి ఉండవచ్చు’’ అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

ఆగస్టు 26న పార్టీలోని అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి ఆజాద్ లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆజాద్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాహుల్ వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ రాజకీయంగా ఎదగాలని, ఆయన అపరిపక్వత వల్ల పార్టీ చాలా నష్టపోతోందని ఆజాద్ విమర్శించారు.

Chhattisgarh: దమ్ముంటే బయటపెట్టండి.. నడ్డాకు సీఎం బాఘేల్ ఛాలెంజ్

ట్రెండింగ్ వార్తలు