Famous Temple : అప్పుల బాధల్ని తీర్చే దేవాలయం .. దీపం వెలిగిస్తే చాలు రుణబాధల్ని తొలగించే ఆపద్బాంధవుడు..

ఏ పేరుతో పిలిచినా భక్తులను ఆదుకునే ఆపద్భాంధవుడు. భక్తుల అప్పులను కూడా తీర్చే స్వామివారు. ఈదేవాలయంలో దీపం వెలిగించి బాధలు చెప్పుకుంటే చాలు అప్పుల బాధలనుంచి విముక్తి ప్రసాదించే స్వామివారు.

Debt Free  bugulu venkateswara Temple

Debt Free  bugulu venkateswara Temple : దాదాపు ప్రతీ మనిషికి వారి వారి స్థాయిలకు తగిన అప్పులుంటాయి. పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు కూడా వారికి తగినట్లుగా అప్పులు ఉంటాయి. అంటే బ్యాంకులను నుంచి తెచ్చుకునే లోన్లు వంటివి. అయితే అప్పులు లేని సామాన్యులు ఉండరు అంటే అతిశయోక్తికాదు. అప్పుల బాధలతో అల్లాడిపోయేవారు ఈ ‘రుణ’బాధలనుంచి ఎప్పుడు గట్టెక్కుతామురా దేవుడా అనుకుంటు కనిపించని దేవుడిని వేడుకుంటారు. అప్పుల తీర్చుకోవటానికి నానా పాట్లు పడుతుంటారు. అటువంటి ‘అప్పుల బాధితులకు’ ఆపద్భాందవుడుగా వెలుగొందుతున్నాడు శ్రీ వేంకటేశ్వరస్వామి. సాక్షాత్తు లక్ష్మీదేవే భార్యగా ఉన్న వెంకటేశ్వర స్వామి సైతం కుబేరుడుకి అప్పుల ఉన్నాడని..వడ్డీలు కడుతుంటాడని అందుకే ఆయన్ని వడ్డీకాసుల వాడు అని కూడా పిలుస్తారు. అటువంటి వెంకటేశ్వరస్వామి తన భక్తుల మొర ఆకలించి ‘అప్పుల’నుంచి విముక్తి కలిగించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు.

ఎన్నో పేర్లు గల స్వామి ఏ పేరున పిలిచినా పలుకే వెంకన్న తన భక్తులను ‘అప్పుల’ను తీర్చే ఆపద్భాందవుడుగా పూజలందుకుంటున్నారు. ఈ దేవాలయంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని బుగుల్ లేదా గుబులు వేంక‌టేశ్వ‌ర‌స్వామి అని పిలుస్తారు. గుబులు అంటూ కలత, చింత, బాధలు వంటివి తీర్చే వెంకన్నగా పిలుస్తారు. ఈ గుబులు వెంకన్న దేవాలయాన్ని దర్శించుకుని అక్కడ ఉండే అఖండ దీపంలో నూనె పోసి దీపం వెలిగిస్తే ‘అప్పుల బాధలన్నీ’తీరిపోతాయట. అలా తన భక్తుల అప్పులు గుబులను తీర్చే గుబులు వెంకన్నగా పూజలందుకుంటున్నాడు స్వామి.

హైదరాబాద్‌ వరంగల్‌ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనే పోసి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామి వారి అనుగ్రహంతో అప్పులు తీరతాయని భక్తుల నమ్ముతుంటారు. అలా ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు దీపం వెలిగించి స్వామి మా రుణబాధల్ని తీర్చమని వేడుకుంటారు. అలా అక్కడికి వచ్చిన భక్తులు తమ రుణాలు తీరిపోయాయని చెబుతుంటారు.

PM Modi Invitation : అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ప్రధాని మోదీకి ఆహ్వానం

ఈ దేవాలయంలో ప్రతీ శుక్రవారం స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం కార్యక్రమంలో పాల్గొంటే వారికి మానసిన ప్రశాంతత కలుగుతుందని అలాగే శనివారం నాడు స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్ని స్వామివారిని కన్నులారా వీక్షిస్తే సకల బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం. అలా భక్తులు ఈ దేవాలయానికి వచ్చి దీపం వెలిగించి మొక్కుకుంటారు. తమ రుణాలు తీరిపోతే తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

అప్పులు నుంచి విముక్తి కోసం స్వామివారే తపస్సు చేసిన స్థలం
ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం..తన వివాహం కోసం కుబేరుడి వద్ద వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయట పడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారని కథనాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక్క‌డ‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధ‌లున్నా స‌రే ఆ బాధ‌ల నుంచి విముక్తి పొందుతార‌ని భక్తులు నమ్మకం.

కుబేరుని అప్పుని తీర్చ‌లేక వేంక‌టేశ్వ‌ర స్వామివారు చింతతో, దిగులుతో చిల్పూరు గుట్ట‌కు వ‌చ్చార‌ని..ఆ కొండ‌పై ఉన్న గుహ‌లో కుబేరుడి అప్పు తీర్చ‌లేద‌ని బాధ‌ప‌డుతూ త‌ప‌స్సులో ఉండిపోయార‌ని స్థ‌ల‌పురాణం చెబుతోంది. కుబేరుని అప్పు తీర్చ‌లేక ఇక్కడ‌కు వ‌చ్చి త‌ప‌స్సు చేశారు కాబ‌ట్టి ఈ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని బుగుల్ లేదా గుబులు వేంక‌టేశ్వ‌ర‌స్వామి అని పిలుస్తారు. బుగుల్ (గుబులు) అంటే చింత‌, దిగులు అని అర్ధం.

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు ఈ గుట్ట‌కు వ‌చ్చిన‌ గుర్తులు ఇక్కడ ఉన్నాయి. ఆ కొండ క్రింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులుంటాయి. స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అని పిలుస్తారు. ఇక్క‌డే ఒక అఖండ దీపం వెలిసింద‌ని స్థలపురాణం మ‌న‌కు తెలియ‌జేస్తోంది.ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనే వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి రుణబాధలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

 

ట్రెండింగ్ వార్తలు