అపార సంపద చుట్టూ అంతుచిక్కని నాగబంధం.. ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా!?

ఎక్కడో తెలియని భయం.. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాభరా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తోంది. మూడో గదిని తెరిస్తే మటాషే అని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత?

snakes guards of puri shree jagannath temple treasure

puri jagannath temple treasure: కోర్టు ఆదేశాలిచ్చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రత్న భండార్‌ను తెరిచేందుకు అయింది. కానీ ఇక్కడే సమస్య వచ్చి పడింది. సమస్య అంటే మామూలు సమస్య కాదు. ఎక్కడో తెలియని భయం.. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాభరా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తోంది. రత్న భండార్‌ను తెరవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఓ రకమైన ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతోంది. యావత్ దేశం శ్రీక్షేత్ర రత్న భండార్‌లో ఏముందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రత్నభండార్ రహస్యాన్ని బయటపెట్టేందుకు ఆసక్తిగా ఉంది. కాకపోతే రత్నభండార్ తలుపులు తెరవాలంటే వణుకిపోయే పరిస్థితి వచ్చేసింది.

పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఓ పేరున్న మంత్రగత్తె కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మెడికల్ కిట్‌తో సాయుధ బలగాల వైద్య బృందం, పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్‌ను అందుబాటులో ఉంచనున్నారు. అంటే రత్న భండార్‌ను తెరిచే టీమ్‌లో ఎంత ఆందోళన ఉందో అర్థం చేసుకోవచ్చు.

రహస్య గది మిస్టరీ
కొన్నేళ్లుగా రత్న భండార్ రహస్య గది పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. రత్న భాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపునకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల దగ్గర.. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల దగ్గర.. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవచ్చు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడి ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరిస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు ఓపెన్ చేయడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు.

1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మూడో గది తెరిచేందుకు ప్రయత్నం చేశారు. అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి ఒక్కసారిగా భయానక శబ్ధాలు, పాములు బుసలు కొట్టినట్లు సౌండ్ వినిపించడంతో అధికారులు భయపడి వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. అందుకే రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు కొందరు శ్రీక్షేత్ర అర్చకులు. దేవుడి ఆదేశాలను కాదని ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనమేనని, విపత్తులు వస్తాయని చెప్పుకొస్తున్నారు.

మూడో గదిని తెరిస్తే మటాషేనా?
పూరీలోని జగన్నాథుని ఆలయంలో కీలకమైన మూడో గదిలో లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. పాముల బుసబుసలు వినిపిస్తున్నాయన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది.? మూడో గదిని తెరిస్తే మటాషే అని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత.? ఈ విషయంపై ప్రభుత్వం వేసిన కమిటీ కూడా ఓ అంచనాలకు రాలేకపోతోంది.

Also Read : పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం.. రహస్య గదిలో 5 చెక్కపెట్టెల్లో విలువైన ఆభరణాలు

అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ మూడోగది మిస్టరీగానే ఉండిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో నేలమాళిగను తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ నాగబంధం ఉందని భయపడి సిరిసంపదలున్న నేలమాళిగను తెరవకుండా ఆగిపోయారు.

మామూలు మనుషులు తెరవలేరా?
దేశంలో ఇన్ని ప్రముఖ ఆలయాలు ఉంటే అనంతపద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగకు.. పూరీ ఆలయంలోని రత్నభండార్‌కు మాత్రమే నాగబంధం ఉందన్న చర్చ ఉంది. ఇంతకీ నాగబంధం ఏంటన్నది మాత్రం హాట్ టాపిక్‌ అయిపోయింది. నాగబంధం అనేది పూర్వకాల ప్రక్రియ. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా విలువైన నిధులను ఓ గదిలో ఉంచి అందులో విషవాయువులను, అత్యంత కాలకూట నాగులను మంత్రాలతో బంధించి ఆ నిధికి కాపలాగా ఉంచుతారు. అలాంటి గదిని తెరవాలంటేనే మామూలు మనుషులు అయితే తెరవలేరు. నిధిని కాపాడే మంత్ర విద్యనే నాగబంధం. ఈ నాగబంధం ప్రభావం వందల ఏళ్ల పాటు ఉంటుంది. అందుకే మహామహా మాంత్రికులు కూడా అటువైపు వెళ్లాలంటేనే భయపడిపోతారు. అనంతపద్మనాభ స్వామి ఆలయంలో అయినా.. పూరీ రత్నభండార్‌లో అయినా ఇలాగే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అందుకే రత్నభండార్‌ను తెరిచేందుకు మాంత్రికుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు