Sravana Masam 2023 : ఈరోజు నుంచే నిజ శ్రావణ మాసం ప్రారంభం .. ఆధ్యాత్మిక శోభ కళకళలాడనున్న గృహాలు

ప్రతీ ఇంటి గడపా లక్ష్మీదేవి నిలయాలే. వరలక్ష్మీ వ్రతాలతో ముతైదువలతో ఇళ్లు కళకళలాడనున్నాయి. అధిక శ్రావణమాసం నిన్నటితో ముగిసింది. ఇక నిజ శ్రావణ ప్రారంభమైంది.

nija sravanam 2023

Sravana Masam 2023 : ఈ ఏడాది అధిక శ్రావణమాసాలు వచ్చాయనే విషయం తెలిసిందే. అధిక శ్రావణమాసం పూర్తి అయ్యింది. ఇక నిజ శ్రావణమాసం ఈరోజు నుంచే ప్రారంభమైంది. ఇక ఇళ్లన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోనున్నాయి. ఇళ్లకు మామిడి తోరణాలు..ప్రతీ ఇంటి గడపా లక్ష్మీదేవి నిలయాలుగా మారిపోనున్నాయి. వరలక్ష్మీ వ్రతాలతో ముతైదువలతో ఇళ్లు కళకళలాడనున్నాయి. అధిక శ్రావణమాసం నిన్నటితో అంటే ఆగస్టు 16,(2023)తో ముగిసింది. ఇక నిజ శ్రావణ ప్రారంభమైంది.

పంచాంగ ప్రకారంగా ఆగస్టు నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చిందని చెపుతుంటారు. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు.

Varalakshmi Vratham 2023 : చారుమతిని కరుణించిన వరలక్ష్మీదేవి .. ఎవరీ చారుమతి..?ఆమెకు అమ్మవారు ఇచ్చిన వరాలేంటో తెలుసా..

శ్రావణమాసంలోనే మహిళలు,పూజలు, వ్రతాలు ఆచరిస్తుంటారు. శ్రావణంలో పూజాధికాలు నిర్వహిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. నిజ శ్రావణమాసం ఆగస్ట్ 17 నుండి మొదలై సెప్టెంబరు 15 శుక్రవారం వరకూ ఉంటుంది. ఈ మాసంలో ఆలయాలు భక్తులతో ప్రత్యేక పూజలతో కిటకిటలాడుతుంటాయి. శ్రావణం అంటే పూజల మాసం ప్రతీరోజు ఓ ప్రత్యేకతే.. ప్రతిరోజూ ప్రత్యేకతే.

Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?

శ్రావణమాసం (Sravana Masam)లో సోమవారం శివుడికి అభిషేకాలు చేస్తే వారు సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతారు. అలాగే మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతం, బుధవారం రోజు విఠులుడికి ప్రత్యేక పూజలు, గురువారం రోజు గురుదేవుడికి ఆరాధన, శుక్రవారం లక్ష్మీదేవి పూజలు, శనివారం రోజు హనుమంతుడికి, తిరుమలేశుడికి, శనీశ్వరునికి పూజలు నిర్వహిస్తుంటారు. అలా శ్రావణ మాసంలో ప్రతీరోజు ఓ ప్రత్యేకమైన ఆధ్మాత్మికిత కలిగిన రోజే.

అసలు శ్రావణమాసం అంటేనే పండుగల మాసం అని పేరు. వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు ఎన్నో పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. నాగపంచమి, పుత్త్రైకాదశి, వరలక్ష్మీవ్రతం, రాశీ పున్నమి, రుషిపంచమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య ఇలా ఎన్నో పండగలు శ్రావణంలోనే వస్తాయి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. అంటే ఈ ఏడాది వరలక్ష్మీ దేవి పూజ ఆగస్టు 25న ఆచరించాలి.

Sri Garbarakshambigai : గర్భిణులకు రక్షణగా ఉండే జగన్మాత కొలువైన పుణ్యక్షేత్రం గురించి తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు