India vs New zealand Series: టెస్టు జట్టులో సూర్యకుమార్, ఇషాన్‌.. కివీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ

న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు, ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో జరిగే టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. టీ20లో పృథ్వీషాకు చోటు దక్కగా, టెస్టుల్లోకి సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు ఎంట్రీ ఇవ్వనున్నారు. మరోవైపు ఆంద్రా వికెట్ కీపర్ భరత్‌కు వన్డే జట్టులో అవకాశం దక్కింది.

India vs New zealand Series: న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు టీమిండియా జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 379 పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేసిన పృథ్వీ షాకు టీ20 జట్టులో అవకాశం లభించింది. వన్డే జట్టుకు సీనియర్ ఆటగాళ్లు ఉండగా, టీ20 సిరీస్‌కు మాత్రం ఎక్కువగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండగా, టీ20 జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు.

India vs New Zealand: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్..

న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియాలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. అయితే, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వ్యక్తిగత కారణాలరిత్యా వారిని జట్టులో ఎంపిక చేయలేదు. షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండ్ ప్లేయర్లుగా చోటు దక్కించుకున్నారు. అయితే, ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు న్యూజిలాండ్ తో వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. వారికి విశ్రాంతి కల్పించిన బీసీసీఐ పృథ్వీషాకు చోటు కల్పించింది. అదేవిధంగా బోర్డర్ – గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఫిబ్రవరిలో జరిగే టెస్టు సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు టెస్టు జట్టులో అవకాశం దక్కింది. అదేవిధంగా ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది.

India vs Spain: హాకీ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం.. స్పెయిన్‌పై 2–0 గోల్స్‌తో గెలుపు

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ..

రోహిత్ శర్మ (కెప్టెన్); శభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాసింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజుద్దీన్, ఉమ్రాన్ మాలిక్.

India vs New zealand Series Teamindia

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు..

హార్థిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రితురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.

 

India vs Australia Test series

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు..

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి, శ్రేయస్, భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్, షమీ, సిరాజ్, ఉమేశ్, జైదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా.

India vs sri lanka 2nd ODI: రెండో వ‌న్డేలోనూ భార‌త్‌దే విజ‌యం.. సిరీస్ కైవ‌సం.. ఫొటో గ్యాల‌రీ

న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనలో భాగంగా.. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది.

తొలి వన్డే జనవరి 18న (హైదరాబాద్‌)
రెండో వన్డే జనవరి 21న (రాయ్‌పూర్‌)
3వ వన్డే జనవరి 24న (ఇండోర్‌)

మొదటి టీ20 మ్యాచ్ జనవరి 27న (రాంచీ)
రెండో టీ20 మ్యాచ్ జనవరి 29న (లక్నో)
మూడో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 1న (అహ్మదాబాద్‌)

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ..

ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు తొలి టెస్ట్ మ్యాచ్
ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండో టెస్ట్ మ్యాచ్
మార్చి 1 నుంచి 5 వరకు మూడో టెస్ట్ మ్యాచ్
మార్చి 9 నుంచి 13 వరకు నాల్గో టెస్ట్ మ్యాచ్

ట్రెండింగ్ వార్తలు