Ben Stokes : ప్ర‌పంచ‌క‌ప్ ముందు బెన్‌స్టోక్స్ కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌కు షాక్ త‌ప్ప‌దా..!

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కావ‌డానికి మ‌రో 50 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త అందింది.

Ben Stokes

Ben Stokes Reverses ODI Retirement : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కావ‌డానికి మ‌రో 50 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త అందింది. ఆ జ‌ట్టు టెస్టు కెప్టెన్‌, స్టార్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ (Ben Stokes) వ‌న్డేలు ఆడేందుకు సిద్ధం అయ్యాడు. వ‌న్డేల్లో తాను తీసుకున్న రిటైర్‌మెంట్ నిర్ణ‌యం పై వెన‌క్కి త‌గ్గాడు. ప్ర‌పంచ క‌ప్ నేప‌థ్యంలో బెన్‌స్టోక్స్ జ‌ట్టులో ఉంటే బాగుంటుంద‌ని బావించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, వ‌న్డే కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ లు ఈ మేర‌కు స్టోక్స్‌ను ఒప్పించ‌డంలో స‌ఫ‌లం అయ్యారు.

2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఇంగ్లాండ్ జ‌ట్టు గెలుచుకోవ‌డంలో బెన్‌స్టోక్స్ కీల‌క పాత్ర పోషించాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో అత‌డు ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతోంది. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ మ‌రోవైపు స్టోక్స్ ఒంట‌రి పోరాటం చేశాడు. చివ‌రికి క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన త‌న జ‌ట్టుకు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను అందించాడు. ఇంగ్లాండ్‌కు ఇదే మొద‌టి వ‌న్డే ప్ర‌పంచ‌కప్ కావ‌డం గ‌మ‌నార్హం.

PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్న సొంత అభిమానులు.. చేసిన ప‌ని అలాంటిది మ‌రీ..!

ఆ త‌రువాత గాయాలు, ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల కార‌ణంగా గ‌తేడాది స్టోక్స్ వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ఆ త‌రువాత సుధీర్ఘ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఎంపికై బ‌జ్‌బాల్ విధానంతో త‌న జ‌ట్టుకు అద్వితీయ‌మైన విజ‌యాల‌ను అందిస్తున్నాడు. అయితే.. భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆల్‌రౌండ‌ర్ అయిన స్టోక్స్ ఆడితే త‌మ జ‌ట్టు మ‌రోసారి క‌ప్పును గెలుస్తుంద‌ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బావించింది.

ఈ విష‌యంమై ప‌లు మార్లు స్టోక్స్‌తో చ‌ర్చించింది. వ‌న్డే కెప్టెన్ అయిన జోస్ బ‌ట్ల‌ర్ సైతం నిత్యం స్టోక్స్‌తో ట‌చ్‌లో ఉంటూ అత‌డు తిరిగి వ‌న్డేల్లో ఆడేందుకు ఒప్పించాడు. అత‌డు ఒప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ జ‌ట్టు ఆడ‌నున్న వ‌న్డే, టీ20 సిరీస్‌కు స్టోక్స్‌ను ఎంపిక చేశారు.

ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్ టికెల్ కావాలా.. ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకోండి

ఇక స్టోక్స్ ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోనూ భాగం కానున్నాడు. స్టోక్స్ జ‌ట్టులోకి రావ‌డంతో ఇంగ్లాండ్ బ‌లం రెట్టింపు అయిన‌ట్లు అయ్యింది. ఇది ఒక విధంగా భార‌త్‌కు న‌ష్టం చేసేదే.

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు..

ఇంగ్లాండ్ వ‌న్డే జ‌ట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్

ఇంగ్లాండ్ టీ20 జ‌ట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ డబ్ల్యూడ్

Rishabh Pant : ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పంత్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌..?

ట్రెండింగ్ వార్తలు