Asia Cup 2023 : స్టేడియంలో కొట్టుకున్న భార‌త్, శ్రీలంక ఫ్యాన్స్‌..!

ఆసియా క‌ప్ 2023 సూప‌ర్-4 ద‌శ‌లో శ్రీలంక‌, భార‌త జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రిగింది.

Fans Fight

Asia Cup : ఆసియా క‌ప్ (Asia Cup) 2023 సూప‌ర్-4 ద‌శ‌లో శ్రీలంక‌, భార‌త జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు 41 ప‌రుగుల తేడాతో లంక‌ను చిత్తు చేసి ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. అయితే.. మ్యాచ్ ముగిసిన త‌రువాత గ్యాల‌రీలో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వీడియోలో ఏం ఉందంటే..?

భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలోని స్టాండ్స్‌లో వాతావరణం వేడెక్కింది. ఇరు జ‌ట్ల ఫ్యాన్స్ ఒకరిపై మ‌రొక‌రు చేయి చేసుకున్నారు. శ్రీలంక జట్టు జెర్సీ ధరించిన ఓ అభిమాని భారత అభిమాని వద్దకు పరుగెత్తుకుని వ‌చ్చి అత‌డిపై పిడి గుద్ద‌ల వ‌ర్షం కురిపించాడు. ఆ స‌మ‌యంలో కొంద‌రు వారిద్ద‌రిని వేరు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఆ వీడియోలో క‌నిపించింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Asia Cup 2023: ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌లో భారత్ వర్సెస్ పాక్ జట్లు? అలా జరగాలంటే పాకిస్థాన్ ఏం చేయాలో తెలుసా..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. టీమ్ ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. కేఎల్ రాహుల్ (39), ఇషాన్ కిషన్ (33)లు ఫర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ(3), శుభమన్ గిల్ (19), హార్దిక్ పాండ్య (5), రవీంద్ర జడేజా (4)లు విఫలం అయ్యారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా చరిత అసలంక నాలుగు, మహేశ్ తీక్షణ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం.. ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన లంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే ప‌రిమిత‌మైంది. టీమ్ఇండియా 41 పరుగుల తేడాతో గెలిచింది. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (42 నాటౌట్; 46 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్) ధనంజయ డిసిల్వా (41; 66 బంతుల్లో 5ఫోర్లు) జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌లయ‌త్నం చేశారు. మిగిలిన వారిలో పాతుమ్ నిస్సంక (6), కుశాల్ మెండీస్ (15), దిముత్ కరుణరత్నే (2), ధసున్ శనక (9) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా బుమ్రా, జడేజా చెరో రెండు సిరాజ్, హర్ధిక్ ఒక్కొ వికెట్ తీశారు.

Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత..

ట్రెండింగ్ వార్తలు