Harsh Goenka : టీమ్ఇండియా జెర్సీ స్పాన్స‌ర్ల‌కు శాపం త‌గులుతోందా..? బైజూస్ నుండి డ్రీమ్11 వరకు..!

భార‌త జ‌ట్టు జెర్సీ స్పాన్స‌ర్ హ‌క్కుల‌ను ( Indias Official Jersey Sponsors) ఇటీవ‌ల ప్ర‌ముఖ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 పొందిన సంగ‌తి తెలిసిందే. జూలై 2023 నుంచి మార్చి 2026 వరకు డ్రీమ్ 11 లీడ్ స్పాన్స‌ర్ హ‌క్కుల‌ను క‌లిగి ఉంది.

Harsh Goenka Believes Indias Official Jersey Sponsors Are Jinxed

Industrialist Harsh Goenka : భార‌త జ‌ట్టు జెర్సీ స్పాన్స‌ర్ హ‌క్కుల‌ను ( Indias Official Jersey Sponsors) ఇటీవ‌ల ప్ర‌ముఖ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 పొందిన సంగ‌తి తెలిసిందే. జూలై 2023 నుంచి మార్చి 2026 వరకు డ్రీమ్ 11 లీడ్ స్పాన్స‌ర్ హ‌క్కుల‌ను క‌లిగి ఉంది. భార‌త పురుషుల‌, మ‌హిళ‌లు, U-19 క్రికెట‌ర్లు ధ‌రించే జెర్సీ ముందు భాగంలో డ్రీమ్ 11 ఉండ‌టాన్ని చూస్తూనే ఉన్నాం. ఇంత‌క‌ముందు ఉన్న స్పాన్స‌ర్ బైజూస్ టీమ్ఇండియా ఆడే దేశ‌వాలీ ఒక్కొ మ్యాచ్‌కు రూ.5.07కోట్లు, ఐసీసీ, ఏసీసీ మ్యాచుల‌కు రూ.1.56 కోట్లు చెల్లించింది.

అయితే.. టీమ్ఇండియాకు జెర్సీ స్పాన్స‌ర్లుగా వ్య‌వ‌హరించిన కంపెనీల‌కు శాపం త‌గిలి న‌ష్టాల‌ను చ‌విచూస్తున్న‌ట్లు ప్ర‌స్తుతం ఇంట‌ర్‌నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. భార‌త జ‌ట్టు కొత్త జెర్సీ స్పాన్స‌ర్ అయిన డ్రీమ్ 11 దాదాపు 44,000 కోట్ల ప‌న్ను ఎగ‌వేసిన‌ట్లు ఇటీవ‌ల DGGI ద్వారా ఐటీ నోటీసును అందుకుంది. దీన్ని డ్రీమ్ 11 బాంబే హైకోర్టులో స‌వాల్ చేసింది. కాగా.. మాజీ స్పాన్సర్ బైజస్ తీవ్ర సంక్షోభంలో ఉంది. దీంతో జెర్సీ స్పాన్స‌ర్లుగా ఉన్న వారికి శాపం త‌గులుతోంద‌ని నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

దీనిపై భార‌త వ్యాపార‌వేత్త హ‌ర్ష గొయాంక చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మాజీ టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌లు సహారా, ఒప్పో, స్టార్, బ్జియస్, డ్రీమ్11 లు బీసీసీఐతో వారి అనుబంధం తర్వాత ఎలాంటి ద‌శ‌ను ఎదుర్కొన్నాయో ఆ ట్వీట్‌లో ఉంది. ఇక టీమ్ఇండియా పేరును భారత్‌గా మార్చాలని బీసీసీఐకి గోయెంకా సూచిస్తున్నారు.

హ‌ర్ష గొయాంక ట్వీట్‌లో ఏముందంటే..?

స్పాన్స‌ర్ ఆఫ్ ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌.. స‌హారా దివాళా తీసింది. య‌జ‌మాని జైలుకి వెళ్లాడు. OPPOను భారతీయులు బహిష్కరించారు. STAR అన్ని టీవీ ప్రధాన హక్కులను అమ్మకానికి కోల్పోయింది. BYJUS భారీ నష్టాలను చవిచూసింది. భార‌త స్పాన్స‌ర్‌గా ఉన్న DREAM 11 కు ఇప్పుడు 28% GST వర్తింపజేయబడింది. ఇటీవ‌లే భారీ పన్ను ఎగవేత నోటీసును అందుకుంది అని హ‌ర్ష గొయాంక చేసిన ట్వీట్ లో ఉంది.

Ind vs Aus 3rd ODI : లబుషేన్‌ను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు