ICC ODI Rankings : దుమ్ములేపిన డికాక్‌, క్లాసెన్‌.. అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ‌గా గిల్‌

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంక్సింగ్‌లో భారత ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ అయ్యాడు.

ICC ODI Rankings

ICC Rankings : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంక్సింగ్‌లో భారత ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ అయ్యాడు. 823 రేటింగ్ పాయింట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. మొద‌టి స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం(829) కంటే కేవ‌లం 6 పాయింట్లే వెనుక‌బ‌డి ఉన్నాడు. డెంగ్యూ కార‌ణంగా ప్ర‌పంచక‌ప్ ఆరంభ మ్యాచుల్లో గిల్ ఆడ‌లేదు. పాక్‌పై ఎంట్రీ ఇచ్చినా 16 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యాడు. బంగ్లాదేశ్ పై హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి వ‌చ్చాడు.

డికాక్ మూడు, క్లాసెన్ ఏడు..

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌పంచ‌క‌ప్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న ద‌క్షిణాప్రికా ఆట‌గాళ్లు క్వింట‌న్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్‌లు ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు. మూడు సెంచ‌రీలు చేసిన డికాక్ మూడు స్థానానాలు ఎగ‌బాకి మూడో స్థానానికి దూసుకువ‌చ్చాడు. క్లాసెస్ ఏడు స్థానాలు ఎగ‌బాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అటు భార‌త స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ లు టాప్‌-10లో కొన‌సాగుతున్నారు.

Glenn Maxwell : చ‌రిత్ర సృష్టించిన మాక్స్‌వెల్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ

బంగ్లాదేశ్‌పై తృటిలో శ‌త‌కం (95 ప‌రుగులు) చేజార్చుకున్న విరాట్ కోహ్లీ మూడు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్‌తో క‌లిసి ఐదో స్థానంలో నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.

రెండులోనే సిరాజ్‌..

వ‌న్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మొద‌టి రెండు స్థానాల్లో ఎటువంటి మార్పు లేదు. ఆస్ట్రేలియా పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్ (670 పాయింట్లు) మొద‌టి స్థానంలో టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నారు. ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ కేశవ్ మ‌హ‌రాజ్ ఏకంగా ఐదు స్థానాలు ఎగ‌బాకి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఓ స్థానం దిగ‌జారిన ర‌షీద్ ఖాన్ నాలుగో స్థానానికి ప‌డిపోయాడు. కుల్దీప్‌యాద‌వ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ నుంచి హార్దిక్ పాండ్య మాత్ర‌మే టాప్‌-10లో ఉన్నాడు. 219 రేటింగ్ పాయింట్ల‌తో పాండ్య తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 324 రేటింగ్ పాయింట్లతో షకీబ్ అల్ హసన్ మొద‌టి స్థానంలో కొన‌సాగుతున్నాడు.

David Warner : నెద‌ర్లాండ్స్ పై వార్న‌ర్ విధ్వంసం.. స‌చిన్ రికార్డు స‌మం.. ప‌లు రికార్డులు బ్రేక్‌..

ట్రెండింగ్ వార్తలు