ICC ODI rankings : కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో గిల్‌.. టాప్-10లో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు

ఆసియా క‌ప్ (Asia Cup) 2023లో భార‌త ఓపెన‌ర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మంచి ప్ర‌ద‌ర్శ‌న‌నే చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు వన్డేల్లో త‌న కెరీర్ బెస్ట్ ర్యాంకు ను అందుకున్నాడు.

Shubman Gill jumps to career best

ODI rankings : ఆసియా క‌ప్ (Asia Cup) 2023లో భార‌త ఓపెన‌ర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) మంచి ప్ర‌ద‌ర్శ‌న‌నే చేస్తున్నాడు. రెండు అర్థ‌శ‌త‌కాల సాయంతో 154 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డు వన్డేల్లో త‌న కెరీర్ బెస్ట్ ర్యాంకు ను అందుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్ ( ODI rankings) లో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. దాయాది పాకిస్తాన్ పై అద్భుత సెంచ‌రీ చేసిన ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ, వ‌రుస‌గా అర్థ‌శ‌త‌కాల‌తో రాణిస్తున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌లు చెరో రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకున్నారు. విరాట్ కోహ్లీ ఎనిమిదో ర్యాంకులో రోహిత్ శ‌ర్మ తొమ్మిదో స్థానానికి చేరుకున్నారు.

Asia Cup 2023 : స్టేడియంలో కొట్టుకున్న భార‌త్, శ్రీలంక ఫ్యాన్స్‌..!

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకున్నాడు. 863 రేటింగ్ పాయింట్లు అత‌డి ఖాతాలో ఉన్నాయి. 759 రేటింగ్ పాయింట్ల‌తో గిల్ రెండో స్థానంలో ఉండ‌గా ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు వాన్ డర్ డస్సెన్ 745 పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా డేవిడ్ వార్న‌ర్ (739), ఇమామ్ ఉల్ హ‌క్ (735) లు ఉన్నారు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌.. వ‌న్డేల్లో బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్ ఇవే..

1. బాబర్ ఆజామ్ (పాకిస్తాన్‌) – 863
2. శుభమన్ గిల్ (భార‌త్‌) – 759
3. వాన్ డర్ డస్సెన్ (సౌతాఫ్రికా) – 745
4. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 739
5. ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్‌) – 735
6. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్‌) – 726
7. క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా) – 721
8. విరాట్ కోహ్లీ (భార‌త్‌) -715
9. రోహిత్ శర్మ (భార‌త్‌) – 707
10. ఫఖర్ జమాన్ (పాకిస్తాన్‌) – 705

ఇక బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ఆసియా క‌ప్‌లో వికెట్ల పంట పండిస్తున్న స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ఐదు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. పేస‌ర్ సిరాజ్ తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఆసీస్ పేస‌ర్ జోష్ హేజిల్ వుడ్ త‌న మొద‌టి స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. భార‌త స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఆల్ రౌండర్ల జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.

Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత..

ట్రెండింగ్ వార్తలు