Teamindia New Record: టీమిండియా సరికొత్త రికార్డు.. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్-5 జట్లు ఇవే..

టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే ఫార్మాట్‌లో 3వేల సిక్సులు దాటిన తొలి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు ఈ ఘనత సాధించింది.

Team india

Most Sixes Teams In ODI Cricket : టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ఫలితంగా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు సిక్సర్ల మోత మోగించారు. మొత్తం 18 సిక్సులు కొట్టారు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో 3వేల సిక్సులు బాదిన తొలి జట్టుగా భారత్ జట్టు రికార్డుల్లోకెక్కింది.

TeamIndia batsmens Suryakumar Yadav, Shubman Gill, KL Rahul

భారత్ జట్టు 1974 నుంచి 2023 వరకు మొత్తం 1040 వన్డే మ్యాచ్ లు ఆడింది. ఈ మ్యాచ్‌లలో భారత్ బ్యాటర్లు 2,75,676 బంతులను ఎదుర్కొని 2,18,165 పరుగులు చేశారు. భారత్ జట్టు ఆడిన 1040 వన్డే మ్యాచ్‌లలో 252 మంది ప్లేయర్స్ అరంగ్రేటం చేశారు. మొత్తం 19,508 ఫోర్లు కొట్టగా.. 3007 సిక్సులు బాదారు.

TeamIndia batsmens Suryakumar Yadav

– వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా భారత్ జట్టు మొదటి స్థానంలో ఉంది. భారత్ బ్యాటర్లు 1040 వన్డే మ్యాచ్‌లలో 3,007 సిక్సులు బాదారు.
– రెండో స్థానంలో వెస్టిండీస్ జట్టు నిలిచింది. వెస్టిండీస్ బ్యాటర్లు 867 వన్డే మ్యాచ్ లలో 2,953 సిక్సులు కొట్టారు.
– మూడో స్థానంలో పాకిస్థాన్ జట్టు నిలిచింది. ఆ జట్టు బ్యాటర్లు 961 వన్డే మ్యాచ్‌లలో 2,566 సిక్సులు బాదారు.
– నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఆ జట్టు బ్యాటర్లు 985 వన్డే మ్యాచ్‌లలో 2,485 సిక్సులు కొట్టారు.
– ఐదో స్థానంలో న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఆ జట్టు బ్యాటర్లు మొత్తం 810 వన్డేల్లో 2,387 సిక్సులు బాదారు.

ట్రెండింగ్ వార్తలు