India Cricket Team : చరిత్ర సృష్టించిన భారత్.. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ 1

ఆసియా కప్ కొట్టడంతో పాటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో గెలిచి.. India Cricket Team

India Cricket Team (Photo : Google)

India Cricket Team History : క్రికెట్ లో టీమిండియా (Team India) చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను ఓడించడంతో వన్డేలలో నెంబర్ 1 ర్యాంకు దక్కించుకుంది. ఇప్పటికే భారత జట్టు టెస్టులు (118 పాయింట్లు), టీ20ల్లో (264 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు వన్డేల్లో కూడా 116 పాయింట్లతో నెంబర్ 1 ర్యాంకు దక్కించుకోవడంతో అన్ని ఫార్మాట్లలో టాప్ ప్లేస్ లో నిలిచి ఈ ఘనత సాధించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.

ICC ర్యాంకింగ్స్ లో ఇప్పటికే T20, టెస్టుల్లో టాప్ ప్లేస్ లో ఉంది టీమిండియా. ఈరోజు (సెప్టెంబర్ 22) ఆస్ట్రేలియాపై ఘన విజయంతో వన్డేల్లో కూడా నెంబర్ వన్ ర్యాంక్ లో నిలిచింది టీమిండియా. వన్డేల్లో టాప్ లో ఉన్న పాకిస్తాన్ ని(115) వెనక్కి నెట్టి నెంబర్ స్థానాన్ని దక్కించుకుంది. ఆసియా కప్ కొట్టడంతో పాటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో గెలిచి టాప్ పొజిషన్ కి చేరింది భారత్. 111 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో ర్యాంకులో కంటిన్యూ అవుతోంది.

Also Read: వన్డే ప్రపంచ కప్ పాకిస్థాన్ స్క్వాడ్ ఇదే.. నసీమ్ షా ఔట్

జట్టు పరంగానే కాదు.. మన ప్లేయర్లు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. నెంబర్ 1 ర్యాంకులతో మెరిశారు. ఐసీసీ వన్డే బౌలింగ్ లో నెంబర్ వన్ స్థానంలో సిరాజ్ ఉన్నాడు. T20లలో బ్యాటింగ్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్ లో సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా ఉన్నాడు. అటు రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. ఇక, వన్డేలలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు శుబ్ మన్ గిల్. ఇలా ఐసీసీ ర్యాంకింగ్స్ పరంగా టాప్ ప్లేస్ లో నిలిచి పవర్ చూపించారు భారత ఆటగాళ్లు.

ఓ జట్టు మెన్స్ క్రికెట్ లో ఇలా అన్ని ఫార్మాట్లలో నెంబర్ 1 ర్యాంకు సాధించడం ఇది రెండోసారి. గతంలో సౌతాఫ్రికా జట్టు ఈ ఘనత సాధించింది. 2012లో అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు దూరం

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ బంతితో నిప్పులు చెరిగాడు. 5 వికెట్లు తీసిన ఆసీస్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించాడు. భారత జట్టు 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పయి లక్ష్యాన్ని చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(71), శుభ్ మన్ గిల్(74) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆ తర్వాత సూర్య(50), కేఎల్ రాహుల్(58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు.

ట్రెండింగ్ వార్తలు