India vs Ireland 1st T20 Match: లాస్ట్‌లో వచ్చి సిక్సర్ల మోతమోగించిన ఐర్లాండ్ బ్యాటర్ .. టీమిండియా కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే ..

ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గెలిచినా కొన్ని అంశాల్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.

Barry McCarthy and Jasprit Bumrah

IRE vs IND 2023 1st T20: ఐర్లాండ్ వర్సెస్ టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ బుమ్రా సహా మిగిలిన బౌలర్లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు నష్టపోయి 139 పరుగులు చేసింది. రెండో దఫా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. 6.5 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Barry McCarthy

IRE vs IND: తొలి టీ20లో ఐర్లాండ్‌పై భారత్ విజయం

ఐర్లాండ్ జట్టులో క్యాంఫర్, మెకార్తీ మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. 59 పరుగులకే ఐర్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బారీ మెకార్తీ సత్తాచాటాడు. సిక్సులు, ఫోర్లతో భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో కేవలం 31 బంతుల్లోనే మెకార్తీ 51 నాటౌట్ పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ క్రమంలో మెకార్తీ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియాపై ఎనిమిది, ఆపై స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన క్రికెటర్‌గా మెకార్తీ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్ పేరుపై ఉంది. గతేడాది తిరువనంతపురం వేదికగా జరిగిన టీ20లో కేశవ్ మహారాజ్ (41) పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును మెకార్తీ బ్రేక్ చేశాడు.

Team india

IND vs IRE : గ‌ట్లుంట‌దీ టీమ్ఇండియాతో మ్యాచ్ అంటే.. హాట్‌ కేక్‌ల్లా అమ్ముడవుతున్న టికెట్లు.. దొర‌క‌ట్లే..!

ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ బుమ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గెలిచినా కొన్ని అంశాల్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. మా జట్టులో ప్రతిఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఐపీఎల్ లో ఆడిన అనుభవం వారికి అక్కరకొచ్చింది. ప్రతి మ్యాచ్ మనకు కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఐర్లాండ్ కూడా బాగా ఆడింది. మిగిలిన మ్యాచ్ లలోనూ మెరుగైన ప్రదర్శన చేసి విజయం సాధిస్తాం అని బుమ్రా తెలిపారు.

ఇదిలాఉంటే చాలాన్నాళ్ల తరువాత జట్టులోకి వచ్చిన స్టార్ ఫేసర్, కెప్టెన్ బుమ్రా రాణించాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంపై బుమ్రా మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్లకూడా చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏన్సీఏలో చాలా కష్టపడ్డాను. ప్రాక్టీస్ సమయంలో ఎన్సీఏ సపోర్ట్ స్టాప్ వల్లే మళ్లీ నేను గతంలోలా బౌలింగ్ చేయగలుగుతున్నాను. ఈ క్రెడిట్ వారికి ఇవ్వాలనుకుంటున్నాను అని బుమ్రా చెప్పారు. తన కెప్టెన్సీలో తొలి మ్యాచ్ విజయం సాధించడం కూడా సంతోషంగా ఉందని బుమ్రా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు