IND vs IRE : గ‌ట్లుంట‌దీ టీమ్ఇండియాతో మ్యాచ్ అంటే.. హాట్‌ కేక్‌ల్లా అమ్ముడవుతున్న టికెట్లు.. దొర‌క‌ట్లే..!

ఏవైన రెండు ప్ర‌ధాన జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే క్రికెట్ స్టేడియాలు కిక్కిరిసిపోవ‌డాన్ని సాధార‌ణంగా చూస్తూనే ఉంటాం. టీమ్ఇండియా లాంటి ప‌టిష్ట‌మైన జ‌ట్టు ప‌సికూన అయిన ఐర్లాండ్ తో సిరీస్ అంటే ఎవ్వ‌రూ పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూప‌రు.

Team India

India vs Ireland : ఏవైన రెండు ప్ర‌ధాన జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే క్రికెట్ స్టేడియాలు కిక్కిరిసిపోవ‌డాన్ని సాధార‌ణంగా చూస్తూనే ఉంటాం. ఇండియా vs పాకిస్తాన్‌, ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా లాంటి హైవోల్టేజీ మ్యాచ్‌ల‌కు టికెట్లు దొర‌క‌డం చాలా క‌ష్టం. టీమ్ఇండియా(Team India) లాంటి ప‌టిష్ట‌మైన జ‌ట్టు ప‌సికూన అయిన ఐర్లాండ్(Ireland) తో సిరీస్ అంటే ఎవ్వ‌రూ పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూప‌రు. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి సార్ ఆట‌గాళ్లు ఉంటే త‌ప్ప స్టేడియాల‌కు ప్రేక్ష‌కులు రావ‌డం క‌ష్ట‌మే.

వీరిద్ద‌రు లేకుండా దాదాపు ద్వితీయ శ్రేణి జ‌ట్టుతో ఐర్లాండ్ పర్య‌ట‌న‌కు భార‌త్ వెళ్లింది. దీంతో ఈ మ్యాచ్‌ల‌ను స్టేడియంలో ప్ర‌త్య‌క్షంగా ఎంత‌మంది చూస్తురు అనే ప్ర‌శ్న ఉద‌యించ‌డం స‌హ‌జం. అయితే.. ఐర్లాండ్‌లో క్రికెట్ అభిమానులు త‌క్కువ ఏం కాదు. ముఖ్యంగా టీమ్ఇండియాకు ఇక్క‌డ పెద్ద సంఖ్య‌లో ఫ్యాన్స్ ఉన్నారు. అందుక‌నే మొద‌టి రెండు టీ20 ల‌కు సంబంధించిన టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. ఇక మూడో టీ20 సంబంధించిన టికెట్ల‌ను హ‌ట్ కేకుల్లా కొంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు త‌మ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Shreyas Iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. నిజంగానే మ‌న‌సున్న మా రాజు.. వీడియో వైర‌ల్‌

భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య ఆగ‌స్టు 18 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు డబ్లిన్‌లోని ‘ది విలేజ్’ మలాహైడి క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ స్టేడియం సామ‌ర్థ్యం 11,500. బుమ్రా సార‌థ్యంలో టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. దాదాపు ఏడాది త‌రువాత రీ ఎంట్రీ ఇస్తున్న బుమ్రా ఎలా ఆడ‌తాడు అనే దానిపైనే అంద‌రి దృష్టి నెల‌కొంది.

భార‌త జ‌ట్టు 2018, 2022లో ఐర్లాండ్‌లో ప‌ర్య‌టించింది. ఇప్పటి వరకు ఇరు జ‌ట్ల మ‌ధ్య 5 టీ20 మ్యాచులు జ‌రుగ‌గా అన్నింటిలోనూ టీమ్ఇండియానే విజేత‌గా నిలిచింది.

ODI World Cup : టీమ్ఇండియాను వేధిస్తున్న నంబ‌ర్ 4 స‌మ‌స్య‌.. ఎవరూ ఊహించని సజెషన్.. మేనేజ్‌మెంట్ అంగీక‌రించేనా..?

భారత జట్టు ఇదే : జ‌స్‌ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్‌ కృష్ణ , అర్ష్‌దీప్‌ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.

ట్రెండింగ్ వార్తలు