Jake Fraser McGurk : 29 బంతుల్లో సెంచ‌రీ చేసిన ఆసీస్ బ్యాట‌ర్.. డివిలియ‌ర్స్ రికార్డు బ్రేక్‌

సౌత్ ఆస్ట్రేలియా బ్యాట‌ర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చ‌రిత్ర సృష్టించాడు. కేవ‌లం 29 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు.

Jake Fraser McGurk

Jake Fraser McGurk : సౌత్ ఆస్ట్రేలియా బ్యాట‌ర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చ‌రిత్ర సృష్టించాడు. కేవ‌లం 29 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఈ క్ర‌మంలో లిస్ట్-ఏ (అంత‌ర్జాతీయ వ‌న్డేలు, దేశ‌వాలీ వ‌న్డే టోర్నీలు) క్రికెట్‌లో వేగ‌వంత‌మైన శ‌త‌కాన్ని న‌మోదు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఆస్ట్రేలియా దేశ‌వాలీ వ‌న్డే టోర్నీ మార్ష్ క‌ప్‌-2023లో ఆదివారం టాస్మానియాతో సౌత్ ఆస్ట్రేలియా త‌ల‌ప‌డింది. సౌత్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రేజ‌ర్ మెక్‌గుర్క్ విధ్వంసం సృష్టించాడు.

కేవ‌లం 29 బంతుల్లోనే శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 38 బంతులు ఆడిన ప్రేజ‌ర్ 10 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో 125 ప‌రుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో 2015లో లిస్ట్-ఏ క్రికెట్‌లో సౌతాఫ్రికా దిగ్గ‌జ ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. జొహెనెస్ బ‌ర్గ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డివిలియ‌ర్స్ 31 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. మొత్తంగా ఆ మ్యాచులో డివిలియ‌ర్స్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్స‌ర్లతో 149 ప‌రుగులు చేశాడు.

David Warner : చ‌రిత్ర సృష్టించిన డేవిడ్ వార్న‌ర్‌.. స‌చిన్, డివిలియ‌ర్స్ రికార్డు బ‌ద్ద‌లు

దాదాపు 10 ఏళ్లుగా డివిలియ‌ర్స్ పేరిట ఉన్న ఈ రికార్డును ప్రేజ‌ర్ బ్రేక్ చేశాడు.2019లో మెల్‌బోర్న్‌లో క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా తరఫున అరంగేట్రం చేసిన తర్వాత ఫ్రేజర్ మెక్‌గర్క్‌కి ఇదే తొలి దేశీయ సెంచరీ కావ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు