Jason Roy In PSL : వామ్మో ఇదేం బాదుడు.. 20 ఫోర్లు, 5 సిక్సర్లు.. దెబ్బకు రికార్డు బద్దలు

Jason Roy In PSL : ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ వీరోచిత పోరాటంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో భారీ విజయం నమోదైంది. అతడి దెబ్బకు రికార్డు బద్దలయ్యాయి.

Jason Roy In PSL : ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ వీరోచిత పోరాటంతో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో భారీ విజయం నమోదైంది. PSLలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేజింగ్ చేసిన జట్టుగా క్వెట్టా గ్లాడియేటర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. జాసన్ రాయ్ సునామీ ఇన్నింగ్స్ తో 241 పరుగుల టార్గెట్ ఛేదించి రికార్డుకెక్కింది. ఓవరాల్ గా టీ20ల్లో మూడో అతిపెద్ద ఛేజింగ్ గా ఇది నిలిచింది. జాసన్ రాయ్ చెలరేగడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ T20 చరిత్రలో 10 బంతులు మిగిలి ఉండగానే మూడవ అత్యధిక ఛేజింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

పెషావర్ జల్మీ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజాం సెంచరీలతో చెలరేగడంతో పెషావర్ టీమ్ భారీ స్కోరు చేసింది. 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు బాదాడు. సైమ్ అయూబ్ కూడా ధాటిగా ఆడి అర్థసెంచరీ సాధించాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు.

241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ముఖ్యంగా ఓపెనర్ జాసన్ రాయ్ చెలరేగిపోయాడు. కేవలం 63 బంతుల్లోనే 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులు సాధించి.. జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. జాసన్ రాయ్ విజృంభణతో 18.2 ఓవర్లలోనే క్వెట్టా గ్లాడియేటర్స్ విజయాన్ని అందుకుంది. రెండు వికెట్లు కోల్పోయి 243 పరుగులు సాధించింది. మహ్మద్ హఫీజ్ 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో ఇదే అతిపెద్ద ఛేజింగ్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అతిపెద్ద లక్ష్యాన్ని చేజ్ చేసిన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2018లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 245 పరుగుల టార్గెట్ ను ఆసీస్ ఛేజ్ చేసింది.

Also Read : అరుదైన రికార్డులకు చేరువలో కోహ్లీ, అశ్విన్.. నాలుగో టెస్టులో సాధ్యమయ్యేనా?

ట్రెండింగ్ వార్తలు