IND vs PAK : రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ రికార్డును స‌మం చేసిన కేఎల్ రాహుల్‌

త‌న రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ (KL Rahul) ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును స‌మం చేశాడు.

KL Rahul-Virat Kohli

India vs Pakistan : త‌న రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ (KL Rahul) ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును స‌మం చేశాడు. ఆసియాక‌ప్ (Asia Cup) 2023లో భాగంగా కొలొంబోని ప్రేమ‌దాస స్టేడియంలో పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. హారిస్ ర‌వూఫ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బౌండ‌రీ కొట్టాడు. దీంతో అత‌డి వ్య‌క్తిగ‌త స్కోరు 14 ప‌రుగుల‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో రాహుల్ వ‌న్డేల్లో 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు.

IND vs PAK : ఈరోజు మ్యాచ్‌ సాధ్యం కాకపోతే ఏమి జరుగుతుందంటే..?

ఈ మైలు రాయిని చేరుకునేందుకు రాహుల్‌కు 53 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం కాగా విరాట్ కోహ్లి కూడా ఈ ఘ‌న‌త‌ను ఇన్నే ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. భార‌త్ త‌రుపున 2 వేల ప‌రుగులను అత్యంత వేగంగా సాధించిన రికార్డు శిఖ‌ర్ ధావ‌న్ పేరిట ఉంది. ధావ‌న్ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త‌ను అందుకోగా, ఆ త‌రువాత నవజ్యోత్ సింగ్ సిద్దూ (52), సౌరవ్ గంగూలీ (52) లు ఉన్నారు. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో అత్య‌ధిక వేగంగా 2000 ప‌రుగులు చేసిన రికార్డు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హషీమ్‌ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 2వేల ప‌రుగుల‌ను 40 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు.

ICC ODI rankings : పాక్‌ను వెన‌క్కు నెట్టి.. మ‌ళ్లీ వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరిన ఆసీస్‌.. టీమ్ఇండియా ఎక్క‌డంటే..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేస్తోంది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ(56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శుభ్ మ‌న్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు)లు మొద‌టి వికెట్‌కు 121 ప‌రుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే.. వీరిద్ద‌రు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఔట్ అయ్యారు. భార‌త్ ఇన్నింగ్స్‌లో 24.1వ ఓవ‌ర్ల ఆట పూర్తి కాగానే వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. ప్ర‌స్తుతం భార‌త స్కోరు 147/2. కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లి (8) లు క్రీజులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు