Kuldeep yadav 2.0 : ప‌డిలేచిన కెర‌టం.. విమర్శ‌ల‌కు ఆట‌తోనే బ‌దులిచ్చిన కుల్దీప్

కుల్దీప్ యాద‌వ్‌.. చైనామ‌న్ బౌలింగ్ యాక్ష‌న్‌తో అంద‌రి దృష్టినీ ఆకర్షించి కొంత కాలం పాటు టీమ్ఇండియాలో కీల‌క బౌల‌ర్‌గా ఉన్నాడు.

Kuldeep yadav

Kuldeep yadav : కుల్దీప్ యాద‌వ్‌.. చైనామ‌న్ బౌలింగ్ యాక్ష‌న్‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించి కొంత కాలం పాటు టీమ్ఇండియాలో కీల‌క బౌల‌ర్‌గా ఉన్నాడు. అయితే.. గాయాలు, ఫామ్ లేమీతో రెండేళ్ల పాటు టీమ్ఇండియాకు దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో సైతం అత‌డిని బెంచీకే ప‌రిమితం చేశారు. ఇక త‌న ప‌నైపోయింద‌ని చాలా మంది బావిస్తున్న త‌రుణంలో ఫీనిక్స్ ప‌క్షిలా అత‌డు పుంజుకున్న తీరు అద్భుతం. ప్ర‌స్తుతం మూడు ఫార్మాట్ల‌లో రెగ్యుల‌ర్ బౌల‌ర్‌గా మారాడు.

ఒకే ఒక్క‌డు..

టీమ్ఇండియా త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన ఏకైక చైనామ‌న్ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ మాత్ర‌మే. కుల్దీప్ మిన‌హా చైనామ‌న్ శైలితో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ కూడా భార‌త జ‌ట్టులో స్థానం ద‌క్కించుకోలేక‌పోయారు. భార‌త జ‌ట్టులో అత్యంత కీల‌క బౌల‌ర్‌గా ఉన్న కుల్దీప్ ఒక్క‌సారిగా ఫామ్ కోల్పోయాడు. దీంతో ఒక్కో ఫార్మాట్‌లో జ‌ట్టుకు దూరం అవుతూ వ‌చ్చాడు. ఐపీఎల్‌లో సత్తా చాటి తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని భావించినా ఆ ఛాన్స్ అత‌డికి ద‌క్క‌లేదు.

Virat Kohli : లుంగీ డ్యాన్స్ పాట‌కు విరాట్ కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

ఐపీఎల్‌లో కొన్నాళ్ల పాటు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టులో కీల‌క బౌల‌ర్‌గా ఉన్న అత‌డు 2021 సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. కేకేఆర్ అత‌డిని బెంచీకే ప‌రిమితం చేసింది. దీంతో త‌న చిన్ననాట కోచ్ క‌పిల్ పాండేతో క‌లిసి త‌న బౌలింగ్‌లోని లోపాల‌పై దృష్టి పెట్టాడు. అలాగే బంతుల్లో వైవిధ్యాన్ని చూపించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తించాడు. బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో జోషి శిక్ష‌ణ‌లో మ‌రింత రాటు దేలాడు. దేశ‌వాలీలో స‌త్తా చాటాడు.

అదే స‌మ‌యంలో కేకేఆర్ అత‌డిని విడిచిపెట్ట‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌డిని తీసుకుంది. ఢిల్లీ జ‌ట్టులో నిల‌క‌డ‌గా రాణించ‌డంతో టీమ్ఇండియా నుంచి పిలుపు వ‌చ్చింది. త‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతులా ఒడిసి ప‌ట్టుకున్నాడు. ఒక‌ప్పుడు ఎక్క‌డెక్క‌డో బంతులు వేసే కుల్దీప్ రీ ఎంట్రీలో స్థిరంగా తాను అనుకున్న చోట‌నే బంతులు వేయ‌గ‌లుతున్నాడు. వికెట్లు తీస్తూ తిరిగి మూడు ఫార్మాట్ల‌లో కీల‌క బౌల‌ర్‌గా మారాడు.

చాహ‌ల్‌, అశ్విన్‌ల‌ను కాద‌ని..

బంగ్లాదేశ్‌, వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో రాణించ‌డంతో స‌హ‌చ‌ర స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్, సీనియ‌ర్ స్పిన్న‌ర్ అశ్విన్ ల ను కాద‌ని సెల‌క్ట‌ర్లు కుల్దీప్ యాద‌వ్‌ను ఆసియాక‌ప్‌తో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేశారు. రీ ఎంట్రీలో స‌త్తా చాటుతున్న‌ప్ప‌టికీ అత‌డిని ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయడాన్ని చాలా మంది త‌ప్పుబ‌ట్టారు. ఇది త‌ప్పుడు నిర్ణ‌యం అవుతుంద‌ని, జ‌ట్టుకు భారంగా మార‌తాడే త‌ప్ప వికెట్లు తీయ‌డం అత‌డి వ‌ల్ల కాద‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు బాహాటంగానే కుల్దీప్ ను విమ‌ర్శించారు. అత‌డి ప్లేస్‌లో చహ‌ల్ తీసుకోవాల‌ని సూచించారు.

ICC ODI rankings : కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో గిల్‌.. టాప్-10లో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు

అయితే.. త‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎన్న‌డూ కూడా కుల్దీప్ యాద‌వ్ వాటిపై స్పందించ‌లేదు. త‌న ఆట‌తీరుతోనే వాటికి స‌మాధానం చెప్పాల‌ని భావించాడు. ఆసియాక‌ప్‌ను అందుకు వేదిక‌గా ఎంచుకున్నాడు. సూప‌ర్-4 ద‌శ‌లో పాకిస్తాన్ పై 5 వికెట్లు తీశాడు. శ్రీలంక‌పై నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి ఆసియాక‌ప్ 2023లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్ల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు. త‌న ఎంపిక స‌రైందేన‌ని త‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో చెప్ప‌క‌నే చెబుతున్నాడు. ఇదే రీతిలో అత‌డు ప్ర‌పంచ‌క‌ప్‌లో సైతం రాణించి మ‌రోసారి భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడేలా చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు