MS Dhoni: సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు టీమిండియాకు కెప్టెన్‌గా ఒక్కడొచ్చాడు.. భారత్‌కు ఈ విజయాలన్నీ అందించి..

టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ సహా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో విజయాలు అందించాడు.

World Cup in 2011

MS Dhoni Captaincy: అది 2007 సెప్టెంబరు 14.. అంటే సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదేరోజు. టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup) భారత్-పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచు జరుగుతోంది. టీమిండియా, (Team India) పాకిస్థాన్ ఇరు జట్లూ 141 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. అనంతరం బౌల్-అవుట్లో టీమిండియా విజయ దుందుభి మోగించింది.

ఆ మ్యాచు నుంచే టీమిండియాకు కెప్టెన్ గా ఝార్ఖండ్ డైమండ్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించాడు. క్రికెట్ చరిత్రలో ధోనీ కెప్టెన్సీ యుగం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ సహా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో విజయాలు అందించాడు ధోనీ. ఆ రోజును ధోనీ అభిమానులు గుర్తు చేసుకుంటూ నాటి మధురానుభూతులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో ధోనీ ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాడు.

కెప్టెన్సీలో ధోనీ విజయాలు
2007లో టీ20 ప్రపంచకప్
2010లో ఐసీసీ టెస్ట్ మ్యాస్
2010లో ఐపీఎల్ టైటిల్
2010లో ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20
2010లో ఆసియా కప్
2011లో వన్డే ప్రపంచకప్
2011లో ఐసీసీ టెస్ట్ మ్యాస్
2011లో ఐపీఎల్ టైటిల్
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ
2014లో ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20
2016లో ఆసియా కప్
2018లో ఐపీఎల్ టైటిల్
2021లో ఐపీఎల్ టైటిల్
2023లో ఐపీఎల్ టైటిల్

IND vs SL : గెలిచినా టీమ్ఇండియా ఖాతాలో చెత్త‌రికార్డు.. ఓడినా చ‌రిత్ర సృష్టించిన శ్రీలంక‌

ట్రెండింగ్ వార్తలు