Neeraj Chopra : భ‌ళా నీర‌జ్ చోప్రా.. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత

భార‌త జావెలిన్ త్రో స్టార్, టోక్యో ఒలింపిక్స్ ఛాంపియ‌న్ నీర‌జ్ చోప్రా 2024లో పారిస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించాడు. శుక్ర‌వారం నీర‌జ్ అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

Neeraj Chopra

Neeraj Chopra-Paris Olympics : భార‌త జావెలిన్ త్రో స్టార్, టోక్యో ఒలింపిక్స్ ఛాంపియ‌న్ నీర‌జ్ చోప్రా 2024లో పారిస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించాడు. శుక్ర‌వారం నీర‌జ్ అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌(World Athletics Championships) క్వాలిఫ‌య‌ర్స్‌లో పాల్గొన నీర‌జ్‌.. జావెలిన్‌ను 88.77 మీట‌ర్ల దూరం విసిరాడు. ఈ సీజ‌న్‌లో ఇదే అత‌డి అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం విశేషం. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లాడు.

BCCI : టీమిండియా ప్లేయర్స్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్.. ముఖ్యంగా కోహ్లీకి..!

ఫైన‌ల్‌కు వెళ్లేందుకు క‌టాఫ్ మార్క్ 83 మీట‌ర్లు కాగా నీర‌జ్ తొలి ప్ర‌య‌త్నంలోనే 88.77 మీట‌ర్ల విసిరి అర్హ‌త సాధించాడు. అదే స‌మ‌యంలో పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) అర్హ‌త సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే 85.5 మీటర్ల దూరం విసరాల్సి ఉండగా నీరజ్ ఈజీగా అధిగ‌మించాడు.

Sourav Ganguly: వారం రోజుల్లో భారత్-పాక్ వన్డే మ్యాచ్.. సౌరవ్ గంగూలీ ఏమన్నారో తెలుసా?

ఇదిలా ఉంటే.. మ‌రో జావెలిన్ త్రో అథ్లెట్ మ‌ను బుడాపెస్ట్ వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌పంచ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో తొలి రౌండ్‌లో 78.10 మీట‌ర్లు విసిరాడు. రెండో ప్ర‌య‌త్నంలో 81.31 మీట‌ర్లు, మూడో ప్ర‌య‌త్నంలో 72.40 మీట‌ర్లు విసిరాడు. గ్రూప్‌-ఏ నుంచి నీర‌జ్ క్వాలిఫై అయ్యాడు. జ‌ర్మ‌నీకి చెందిన వెబ‌ర్‌(82.39మీట‌ర్లు), మ‌ను(81.31మీట‌ర్లు ) నీర‌జ్ త‌రువాతి స్థానాల్లో నిలిచారు. ఆదివారం (ఆగస్ట్ 27) ఫైనల్ జరగనుంది. ఫైన‌ల్‌లో నీర‌జ్‌తో పాటు మ‌రో 11 మంది పాల్గొంటారు.

Bray Wyatt Dead: డబ్ల్యూడబ్ల్యూఈలో విషాదం.. 36 ఏళ్లకే కన్నుమూసిన మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్

ట్రెండింగ్ వార్తలు