ODI World Cup 2023: ఆస్ట్రేలియా దెబ్బకు పాక్ జట్టుపై పెరిగిన ఒత్తిడి.. సెమీస్ ఆశలు గల్లంతేనా?

పాయింట్ల పట్టికలో ఇండియా వరుస విజయాలతో (ఐదు మ్యాచ్ లలో 10 పాయింట్లు) మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు (ఐదు మ్యాచ్ లలో 8 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

World Cup 2023 Points Table

World Cup 2023 Points Table: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీలో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కు పాయింట్ల పట్టికలో స్థానాలు మారుతున్నాయి. అఫ్గానిస్థాన్ జట్టుపై ఓటమి తరువాతకూడా పాకిస్థాన్ జట్టుకు సెమీస్ కు చేరుతామన్న ఆశలు ఉన్నాయి. కానీ, ఆస్ట్రేలియా జట్టు దెబ్బకు పాక్ సెమీస్ ఆశలు గల్లంతయ్యే అవకాశలు కనిపిస్తున్నాయి.

Also Read : ODI World Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్‌ చరిత్రలో అతిపెద్ద విజయం.. 309 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు.. 90 కే కుప్ప‌కూలిన నెద‌ర్లాండ్స్‌

బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు చలరేగిపోయారు. ఆ జట్టు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. డేవిడ్ వార్నర్ కూడా సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా 399 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ జట్టు కేవలం 90 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 309 పరుగుల భారీ విజయాన్ని ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా నాల్గో స్థానానికి చేరుకుంది. రన్ రేట్ విషయంలోనూ మెరుగుపడింది.

Also Read : ODI World Cup 2023: పాకిస్థాన్ జట్టుపై విజయం తరువాత బస్సులో డ్యాన్స్ వేసిన అఫ్గాన్ ప్లేయర్స్.. ఏ పాటకో తెలుసా? వీడియో వైరల్

పాయింట్ల పట్టికలో ఇండియా వరుస విజయాలతో (ఐదు మ్యాచ్ లలో 10 పాయింట్లు) మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు (ఐదు మ్యాచ్ లలో 8 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్ పై భారీ విజయంతో ఆస్ట్రేలియా (ఐదు మ్యాచ్ లలో 6 పాయింట్లు) నాల్గో స్థానంలోకి దూసుకెళ్లింది. పాకిస్థాన్ జట్టు ఐదవ స్థానంకు పడిపోయింది. పాకిస్థాన్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించి నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పాకిస్థాన్ సెమీస్ కు చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్ లలోనూ విజయం సాధించాలి. అలాజరిగినా పాక్ సెమీఫైనల్ కు చేరడం కష్టంగా మారింది. ఎందుకుంటే పాక్ రన్ రేట్ లోనూ వెనకబడి ఉంది.

పాక్ సెమీస్ కు చేరాలంటే పాక్ ఆడే నాలుగు మ్యాచ్ లలోనూ మంచి రన్ రేట్ తో విజయం సాధించాలి.. అంతేకాక.. మిగతా జట్లు గెలుపోటములపైనా పాక్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ పై భారీవిజయంతో పాక్ జట్టుపై మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పొచ్చు.

 

World Cup 2023 Points Table

ట్రెండింగ్ వార్తలు