ODI World Cup 2023 : వ‌ర‌ల్డ్ క‌ప్‌ చరిత్రలో అతిపెద్ద విజయం.. 309 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు.. 90 కే కుప్ప‌కూలిన నెద‌ర్లాండ్స్‌

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ప‌సికూన నెద‌ర్లాండ్స్ పై ఆస్ట్రేలియా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. త‌ద్వారా మెగాటోర్నీలో త‌న ర‌న్‌రేట్‌ను మెరుగుప‌ర‌చుకుంది.

Australia beat Netherlands

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ప‌సికూన నెద‌ర్లాండ్స్ పై ఆస్ట్రేలియా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. త‌ద్వారా మెగాటోర్నీలో త‌న ర‌న్‌రేట్‌ను మెరుగుప‌ర‌చుకుంది. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 309 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 400 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నెద‌ర్లాండ్స్ 21 ఓవ‌ర్ల‌లో 90 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ విజ‌యం ఆస్ట్రేలియా సొంత‌మైంది.

నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్ల‌లో విక్రమ్‌జిత్ సింగ్ (25), స్కాట్ ఎడ్వర్డ్స్ (12), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(11), కోలిన్ అకెర్‌మాన్ (10), తేజ నిడమనూరు (14) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో జంపా నాలుగు వికెట్ల‌తో నెద‌ర్లాండ్స్ ప‌త‌నాన్ని శాసించాడు. మిచెల్ మార్ష్ రెండు తీశాడు. మిచెల్ స్టార్క్‌, జోస్ హేజిల్ వుడ్‌, పాట్ క‌మిన్స్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ODI World Cup 2023 : యూసుఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అఫ్గాన్‌పై ఓట‌మి త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబ‌ర్ వెక్కి వెక్కి ఏడ్చాడు..!

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్ (106; 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లు)తో పాటు డేవిడ్ వార్న‌ర్ (104; 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగారు. స్టీవ్ స్మిత్ (71; 68 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), ల‌బుషేన్ (62; 47 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో స‌త్తా చాటారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో లోగాన్ వాన్ బీక్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బాస్ డి లీడే రెండు, ఆర్యన్ దత్ ఒక వికెట్ తీశారు.

ఫాస్టెస్ట్ సెంచ‌రీ..

అరుణ్ జైట్లీ స్టేడియంలో మాక్స్ వెల్ వీర‌వీహారం చేశాడు. నెదర్లాండ్స్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా సిక్స‌ర్లు, ఫోర్ల‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ క్ర‌మంలో 40 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. త‌ద్వారా వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా శ‌త‌కం చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు మార్‌క్ర‌మ్ పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. మార్‌క్ర‌మ్ 49 బంతుల్లో శ్రీలంక పై సెంచ‌రీ చేశాడు.

ICC ODI Rankings : దుమ్ములేపిన డికాక్‌, క్లాసెన్‌.. అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ‌గా గిల్‌

ట్రెండింగ్ వార్తలు