Asia Cup 2023: ఆసియా కప్‌‌లో పాక్ వర్సెస్ భారత్ మ్యాచ్‌పై బాబర్ అజామ్ కీలక వ్యాఖ్యలు

వచ్చేనెల 2న జరిగే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ గురించి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Pakistan captain Babar Azam

IND vs PAK In Asia Cup 2023: ఆసియా కప్ -2023 టోర్నీకి సమయం ఆసన్నమైంది. ఈనెల 30నుంచి టోర్నీ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ జట్టు శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్థాన్ జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఈ మూడు వన్డేల్లో విజయం సాధించి మంచి జోష్‌తో ఉంది. దీనికితోడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆసియా కప్ టోర్నీలో అదే ఊపును కొనసాగించేందుకు పాకిస్థాన్ జట్టు సిద్ధమవుతోంది. మరోవైపు ఆసియా కప్ -2023లో పాకిస్థాన్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ కోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే, వచ్చే నెల 2న దాయాది జట్ల మధ్య పోరు జరగనుంది.

Asia Cup 2023 : ఆసియాక‌ప్ ప్రారంభానికి ముందు క‌రోనా క‌ల‌క‌లం.. టోర్నీకి కొవిడ్ ముప్పు..?

వచ్చేనెల 2న జరిగే భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ గురించి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా చూస్తుంది. క్రికెట్ అభిమానులతోపాటు మేంకూడా ఎంజాయ్ చేస్తాం. ఇరు జట్ల ఆటగాళ్లు వందశాతం ప్రయత్నించి విజయం కోసం పోరాడతాం అని అన్నారు. పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ.. ఇటీవల టీమిండియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఎవరు పైచేయి సాధిస్తారనేది మ్యాచ్ రోజున తెలుస్తుందని అన్నారు.

Asia Cup 2023 : వాళ్లు అదృష్ట‌వంతులు.. అశ్విన్ గురించి చ‌ర్చ వ‌ద్దు.. న‌చ్చ‌క‌పోతే మ్యాచులు చూడ‌కండి

మా నుంచైనా, భారత్ జట్టు నుంచైనా గెలవాలనే కోరుకుంటారు. బరిలోకి దిగినప్పుడే అసలైన సత్తా బయటకొస్తుంది అంటూ షాదాబ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్ జట్టును ప్రకటించిన సందర్భంగా అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో పాకిస్థాన్ పేస్ బౌలింగ్‌ను విరాట్ కోహ్లీ హ్యాండిల్ చేయలగడని అన్నారు. ఆ వ్యాఖ్యలకు పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు