Ravindra Jadeja : వ‌న్డేల్లో ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త‌.. ఎలైట్ లిస్ట్‌లో చోటు..

భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా (Ravindra Jadeja) అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

Ravindra Jadeja completes 200 ODI wickets

Ravindra Jadeja completes 200 ODI wickets : భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా (Ravindra Jadeja) అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. వ‌న్డేల్లో 200 వికెట్లు తీశాడు. ఆసియాక‌ప్ 2023లో సూప‌ర్‌-4 ద‌శ‌లో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 34.1వ ఓవ‌ర్‌లో షమీమ్ హొస్సేన్ (1) ఎల్భీడ‌బ్ల్యూగా ఔట్ చేయ‌డం ద్వారా జ‌డేజా 200 వికెట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టాడు.

ఈ మైలురాయిని సాధించిన ఏడో భారత ఆటగాడిగా నిలిచాడు. 175 ఇన్నింగ్స్‌ల్లో ర‌వీంద్ర జ‌డేజా ఈ ఘ‌న‌త సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక ఎడమచేతి వాటం స్పిన్నర్ అతనే కావడం గ‌మ‌నార్హం.

రెండ‌వ ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా..

వ‌న్డేల్లో 2000 ప‌రుగులు, 200 వికెట్లు తీసిన రెండో భార‌త ప్లేయ‌ర్‌గా ర‌వీంద్ర జ‌డేజా రికార్డుల‌కు ఎక్కాడు. అత‌డి కంటే ముందు క‌పిల్ దేవ్ ఉన్నాడు. కాగా.. ప్ర‌పంచ క్రికెట్‌లో 2వేల ప‌రుగులు 200 ఫ్ల‌స్ వికెట్లు తీసిన‌ 14వ ఆట‌గాడిగా ర‌వీంద్ర జ‌డేజా రికార్డుల‌కు ఎక్కాడు.

Asia Cup 2023 : ఆసియాక‌ప్ నుంచి ఔట్‌ .. ఎన్ని టీవీలు ప‌గిలాయో..? నెట్టింట పాక్ పై జోకులు

ర‌వీంద్ర జ‌డేజా ఈ మ్యాచ్‌తో క‌లుపుని ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 182 వ‌న్డే మ్యాచులు ఆడాడు. 175 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసే అవ‌కాశం రాగా 200 వికెట్లు తీశాడు. 7 సార్లు నాలుగు వికెట్లు, ఒక్క సారి 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌మోదు చేశాడు. అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు 5/36. అటు బ్యాటింగ్‌లో 123 ఇన్నింగ్స్‌ల్లో 2,578 ప‌రుగులు చేశాడు. ఇందులో 13 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 87.

వ‌న్డేల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు వీరే..
* అనిల్ కుంబ్లే – 337 వికెట్లు.
* జవగల్ శ్రీనాథ్ – 315 వికెట్లు.
* అజిత్ అగార్కర్ – 288 వికెట్లు.
* జహీర్ ఖాన్ – 282 వికెట్లు
* హర్భజన్ సింగ్ – 269 వికెట్లు
* కపిల్ దేవ్ – 253 వికెట్లు
* రవీంద్ర జడేజా – 200 వికెట్లు

Virat Kohli : వాట‌ర్‌ బాయ్‌గా మారిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు