Shahid Afridi: గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీ .. ఏమన్నాడంటే..

గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సాహిద్ అఫ్రిది స్పందించారు. గంభీర్ అభిప్రాయాన్ని తప్పుపట్టడంతో పాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Shahid Afridi

Afridi responded to Gambhir statement : భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మైదానంలో ఉన్నాడంటే దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసింది. అయితే, తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో జరిగిన డిబేట్ లో గౌతమ్ మాట్లాడుతూ మైదానంలో క్రీడాకారులు ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పారు. భారత జట్టు బిలియన్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తోందని, స్టేడియం లోపల స్నేహపూరిత చర్యలను ప్రదర్శించకూడదని అన్నారు. క్రికెటర్లు జాతీయ జట్టుకోసం మైదానంలో ఆడుతున్నప్పుడు సరిహద్దుల వెలుపల స్నేహాన్ని విడిచిపెట్టాలని అని గంభీర్ పేర్కొన్నారు.

Asia Cup 2023 : టీమ్ఇండియాపై వ‌రుణుడికి ఎంత ప్రేమో..! రావ‌ద్ద‌న్నా వ‌స్తున్నాడుగా..? నేపాల్‌తో మ్యాచ్ కూడా..

ఆరు లేదా ఏడు గంటల క్రికెట్ తరువాత ప్లేయర్లు ఇతర దేశాల క్రికెటర్లతో కావాల్సినంత స్నేహపూర్వకంగా ఉండొచ్చు. మైదానంలో మనం ఆడే ఆ గంటలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మీరు మీకు ప్రాతినిధ్యం వహించడం మాత్రమేకాదు.. మీరు బిలియన్లకు పైగా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని గంభీర్ క్రీడాకారులకు సూచించారు. ప్రస్తుతం ప్లేయర్స్ మైదానంలో మ్యాచ్ సమయంలో ఇతర దేశాల ప్లేయర్స్‌తో ఒకరినొకరు వీపుమీద తట్టుకోవడం, సరదాగా సంభాషించడం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం అలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు అంటూ గౌతమ్ గంభీర్ అన్నారు.

Asia Cup 2023 : భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్ర‌భాస్ పాట‌.. బౌండ‌రీ కొట్టిన ప్ర‌తిసారి..!

గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సాహిద్ అఫ్రిది స్పందించారు. గంభీర్ అభిప్రాయాన్ని తప్పుపట్టడంతో పాటు ఘాటుగా స్పందించారు. గంభీర్ ఆలోచనలు పాఠశాల సభ్యత్వాన్నికూడా పొందడం లేదని అన్నారు. గంభీర్ తరహాలో నేను ఆలోచించను. మనం క్రికెటర్లమే కాదు అంబాసిడర్లు కూడా. మనందరికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాబట్టి ప్రేమ, గౌరవం యొక్క సందేశాన్ని పంపడం మంచిది అంటూ అఫ్రిది అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు