Team india: యోయో ఫిట్‌నెస్ పరీక్షలో కోహ్లీ కంటే ఎక్కువ స్కోర్ చేసిన ప్లేయర్ ఎవరో తెలుసా? బీసీసీఐ ఏం చెప్పిందంటే!

యోయో పరీక్ష స్కోర్‌కు సంబంధించిన విషయాలను కొందరు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలా చేయడం కాంట్రాక్ట్ క్లాజ్ ధిక్కరణ కిందకు వస్తుంది. ఇలాంటివి చేయొద్దని మౌఖికంగా ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Virat and gill

Shubman Gill : టీమిండియా ఆసియా కప్-2023కు సిద్ధమవుతోంది. ఆగస్టు 30 నుంచి టోర్నీ ప్రారంభమవుతుంది. అయితే, సెప్టెంబర్ 2న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ జట్టు తలపడనుంది. ఆసియా కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ టీంను ఎంపిక చేసింది. వీరందరికి యోయో పరీక్షలు నిర్వహిస్తుంది. శుక్రవారం కర్ణాటకలోని అలూర్‌లో నిర్వహించిన శిబిరంలో ప్లేయర్స్ ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఐర్లాండ్ పర్యటన నుంచి తిరిగొస్తున్న బుమ్రా, ప్రసిద్ధ్, తిలక్ శర్మ, సంజు శాంసన్ లతో పాటు గాయం నుంచి పూర్తిగా కోలుకోని కేఎల్ రాహుల్ మినహా అందరినీ యోయో పరీక్షలు నిర్వహించారు.

BCCI : టీమిండియా ప్లేయర్స్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్.. ముఖ్యంగా కోహ్లీకి..!

యోయో ఏరోబిక్స్ ద్వారా సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్ష. ఎవరు ఎప్పుడు చివరగా మ్యాచ్ ఆడారు. గతవారం రోజుల్లో వారిపై పని ఒత్తిడి ఎలా ఉంది అన్న అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఫలితాలు వస్తాయి. యోయో పరీక్షలో 16.5 మార్కులు వస్తే భారత జట్టులో కొనసాగడానికి అర్హత ఉంటుంది. అయితే, ఈ పరీక్షలో దాదాపు అందరూ అర్హత సాధించారు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 17.2 స్కోర్ సాధించారు. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. అయితే, బీసీసీఐ అభ్యంతరం తెలిపింది. కోహ్లీ తీరును తప్పుబట్టింది. దీంతో టీమిండియా ప్లేయర్స్‌కు కీలక సూచనలు చేసింది. యోయో పరీక్షకు సంబంధించిన స్కోర్, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దని, పరీక్ష రిజల్ట్స్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని బీసీసీఐ స్పష్టం చేసింది.

Yuvraj Singh : తండ్రి అయిన యువరాజ్ సింగ్

యోయో పరీక్ష స్కోర్‌కు సంబంధించిన విషయాలను కొందరు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలా చేయడం కాంట్రాక్ట్ క్లాజ్ ధిక్కరణ కిందకు వస్తుంది. ఇలాంటివి చేయొద్దని మౌఖికంగా ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే, తాజాగా టీమిండియా ప్లేయర్స్‌లో యోయో పరీక్షలో అత్యధిక మార్కులు సాధించింది ఎవరనే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత్ జట్టులో కోహ్లీ ఫిట్‌నెస్ పరంగా ముందు వరుసలో ఉంటాడని తెలిసిన విషయమే. యోయో పరీక్షలో కోహ్లీ 17.2 మార్కులు వచ్చాయి. అయితే, కోహ్లీ కంటే యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు యోయో పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చాయట. గిల్ ఉత్తమంగా 18.7 మార్కులు సాధించాడట. మిగతా ప్లేయర్స్ 16.5 కంటే ఎక్కువ మార్కులు సాధించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. యోయో పరీక్ష స్కోర్, వివరాలను బయటకు వెల్లడించవద్దని బీసీసీఐ ప్లేయర్స్‌కు సూచించిన తరువాతనే గిల్ స్కోర్ విషయం బయటకు రావటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు