T20 World Cup: సూపర్-12కి అర్హత సాధించిన నాలుగు జట్లు ఇవే.. ఏ జట్టు ఏ గ్రూపు నుంచి ఆడుతుందంటే?

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అసలుసిసలైన సమరం రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 16న ప్రపంచ కప్ మ్యాచ్‌లు ప్రారంభంకాగా.. క్వాలిఫయిర్ రౌండ్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఈ ఎనిమిది జట్లలో నాలుగు జట్లు సూపర్-12కు అర్హత సాధించాయి

T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అసలుసిసలైన సమరం రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 16న ప్రపంచ కప్ మ్యాచ్ లు ప్రారంభంకాగా.. క్వాలిఫయిర్ రౌండ్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఈ ఎనిమి జట్లలో నాలుగు జట్లు సూపర్-12కు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్ లలో పసికూనలు సంచనాలు సృష్టించాయి. అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించాయి.

T20 World Cup 2022: టీ20 ప్రపంచ‌కప్ నుంచి వెస్టిండీస్ ఔట్.. కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక వ్యాఖ్యలు..

క్వాలిఫయిర్ రౌండ్‌లో శ్రీలంక, వెస్టిండీస్, నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్, నమీబియా, స్కాట్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు పోటీ పడ్డాయి. వీటిలో మొదటి రౌండ్ లో గ్రూప్ – ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్, గ్రూప్- బి నుంచి ఐర్లాండ్, జింబాబ్వే జట్లు సూపర్-12కు అర్హత సాధించాయి. రేపటి నుంచి జరిగే సూపర్ -12 మ్యాచ్ లలో గ్రూప్-ఏ నుంచి రెండు జట్లు, గ్రూప్- బి నుంచి రెండు జట్లు మిగిలిన జట్లతో తలపడతాయి.

T20 World Cup-2022: టీ20 ప్రపంచ కప్‌లో ఈ 4 జట్లు సెమీఫైనల్ వెళ్తాయి!: సచిన్

సూపర్ -12లో గ్రూప్ -1లో న్యూజిలాండ్, శ్రీలంక, ఆప్గానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లు తలపడనుండగా, గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే జట్లు తలపడతాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న సూపర్ -12 మ్యాచ్‌లలో భాగంగా శనివారం గ్రూప్-1లోని ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజీలాండ్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆప్గానిస్థాన్ మధ్య పోరు జరగనుంది. 23న గ్రూప్-1 నుంచి శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య, గ్రూప్-2లోని ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు