T20 World Cup 2022: టీ20 ప్రపంచ‌కప్ నుంచి వెస్టిండీస్ ఔట్.. కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక వ్యాఖ్యలు..

టీ20 ప్రపంచ కప్‌లో అసలు సమరం ప్రారంభం కాకముందే వెస్టిండీస్ జట్టు ఇంటిబాటపట్టింది. 2012, 2016 సీజన్లలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ పేలువ ప్రదర్శనతో ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి  నిష్ర్కమించింది.

West Indies Captain Nicholas Pooran

T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్‌లో అసలు సమరం ప్రారంభం కాకముందే వెస్టిండీస్ జట్టు ఇంటిబాటపట్టింది. 2012, 2016 సీజన్లలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ పేలువ ప్రదర్శనతో ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి  నిష్ర్కమించింది. మొదటి రౌండ్‌లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఐర్లాండ్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.

T20 World Cup-2022: టీ20 ప్రపంచ కప్‌లో ఈ 4 జట్లు సెమీఫైనల్ వెళ్తాయి!: సచిన్

హోబార్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్ వేదికగా వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ బ్యాట్స్‌మెన్స్ పేలువ ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఐర్లాండ్ 17.3 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అలవోకగా చేదించింది. అద్భుత ఆటతీరుతో విజయాన్ని అందుకున్న ఐర్లాండ్ సూపర్-12 దశలో అడుగుపెట్టింది. దీంతో గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం రెండింట్లో మాత్రమే గెలుపొందడంతో ‘వరల్డ్ కప్’ సూపర్ -12 దశకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడంతో వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ నిరాశను వ్యక్తం చేశాడు. మేము మా అభిమానులను తీవ్ర నిరాశపరిచాము. ఇది ఖచ్చితంగా బాధిస్తుంది. నేను నా ప్రదర్శనతో నా కుర్రాళ్లను నిరాశపరిచాను అని పూరన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. మేము ఈ టోర్నమెంట్‌లో బాగా బ్యాటింగ్ చేయలేదు. ఐర్లాండ్ మ్యాచ్ లో బ్యాటింగ్ పిచ్ పై కేవలం 145 పరుగులు మాత్రమే చేయగలిగాం. అయితే, ఐర్లాండ్‌కు అభినందనలు, వారు ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్ బాగా చేశారని కొనియాడారు. ఇది మాకు నేర్చుకునే అనుభవం అంటూ విండీస్ కెప్టెన్ పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు