Team India : నంబ‌ర్ 4 స్థానానికి స‌రైనోడు ఎవ‌రు..? 2019 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత నుంచి 12 మంది ఆడితే..

అక్టోబ‌ర్ 4 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. 2011 త‌రువాత టీమ్ఇండియా మ‌రోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌లేదు. ఈ సారి స్వ‌దేశంలోనే మెగా టోర్నీ జ‌ర‌గ‌నుండ‌డంతో భార‌త జ‌ట్టుపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Team India

Team India No 4 Batter : అక్టోబ‌ర్ 4 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) జ‌ర‌గ‌నుంది. 2011 త‌రువాత టీమ్ఇండియా (Team India) మ‌రోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌లేదు. ఈ సారి స్వ‌దేశంలోనే మెగా టోర్నీ జ‌ర‌గ‌నుండ‌డంతో భార‌త జ‌ట్టుపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎలాగైనా విజేత‌గా నిలివాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. అన్ని జట్లు ఈ మెగా టోర్నీ కోసం త‌మ ప్రిప‌రేష‌న్లు మొద‌లుపెట్టాయి. ఈ టోర్నీలో ఆడే తుది జ‌ట్ల‌పై ఓ అంచ‌నాకు వ‌చ్చేశాయి. అయితే.. ఒక్క టీమ్ఇండియా మాత్ర‌మే ఈ విష‌యంలో వెన‌క‌బ‌డి ఉంది.

టీమ్ఇండియాను ఎంతో కాలంగా వేధిస్తున్న స‌మ‌స్య నంబ‌ర్ 4. యువ‌రాజ్ సింగ్ రిటైర్‌మెంట్ త‌రువాత ఆ స్థానంలో నిల‌క‌డ‌గా ఆడే ఆట‌గాడు ఇప్ప‌టి వ‌ర‌కు దొర‌క‌లేదు అంటూ సాక్షాత్తు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చాడు అంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అటు టాప్ఆర్డ‌ర్‌ను ఇటు మిడిల్ ఆర్డ‌ర్‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఈ స్థానంలో ఆడ‌డం అంత సుల‌భం ఏం కాదు. ప‌రిస్థితులకు త‌గ్గ‌ట్లుగా బ్యాటింగ్ శైలిని మార్చుకుంటూ ప‌రుగులు రాబ‌ట్టాల్సి ఉంటుంది.

Heath Streak : నన్ను చంప‌కండ‌య్యా.. నేను ఇంకా బ‌తికే ఉన్నాను.. ఆ వార్త బాధించింది

ఆసియాక‌ప్‌, ఆ త‌రువాత వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌నున్న త‌రుణంలో ఇంకా నంబ‌ర్ 4 స్థానంలో ఆడే ఆట‌గాడిపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం ఈ టోర్నీల్లో భార‌త్‌కు ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం ఉంది. కొంత‌కాలం క్రితం వ‌ర‌కు కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ ఈ స్థానంలో ఆడి రాణించినా ఆ త‌రువాత గాయాల కార‌ణంగా వారు జ‌ట్టుకు దూరం అవ‌డంతో ప‌లువురు ఆట‌గాళ్లు మేనేజ్‌మెంట్ ప‌రీక్షించింది. వెస్టిండీస్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో తిల‌క్ వ‌ర్మ ఆట‌తీరును చూసిన మాజీ క్రికెట‌ర్లు అత‌డు నంబ‌ర్ 4 స్థానానికి సెట్ అవుతాడ‌ని, ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయాల‌నే డిమాండ్ చేస్తున్నారు.

12 మంది ఆట‌గాళ్ల‌ను ప‌రీక్షించారు

2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేల్లో నంబ‌ర్ స్థానంలో 12 మంది ఆట‌గాళ్లు ఆడారు. వీరంద‌రూ క‌లిసి ఈ స్థానంలో ఆడి సాధించిన ప‌రుగుల స‌గ‌టు 33.5గా ఉంది. మూడో స్థానం నుంచి ఏడో స్థానంలో ఆడిన ఆట‌గాళ్ల స‌గ‌టుతో పోలిస్తే నంబ‌ర్ 4 స్థానం స‌గ‌టు అత్య‌ల్పంగా ఉంది.. ఈ 12 మంది ఆట‌గాళ్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ గ‌ణాంకాలు కాస్త మెరుగా ఉన్నాయి. ఈ స్థానంలో శ్రేయ‌స్ 805 ప‌రుగులు చేశాడు. టీ20ల్లో నంబ‌ర్ 1ఆట‌గాడు అయిన సూర్య‌కుమార్ యాద‌వ్ 5 సార్లు ఈ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 30 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

Serena Williams : రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్.. భర్త ట్వీట్ వైరల్.. అభినందనలు తెలుపుతున్న అభిమానులు

కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సాధించేనా..?

2019 ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడుతూ అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల‌లో కేఎల్ రాహుల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. గాయం కార‌ణంగా కొంత కాలంగా ఆట‌కు దూరం అయ్యాడు. ఆసియాక‌ప్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే.. ఆసియాక‌ప్‌లో మొద‌టి రెండు మ్యాచ్‌లు అత‌డు ఆడ‌డం లేదు. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం. మూడో మ్యాచ్ స‌మ‌యానికి క‌ల్లా అత‌డు ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందే రాహుల్ ఫిట్‌నెస్ సాధించి ఫామ్ అందుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్ గాయాల‌తో కొంత‌కాలంగా ఆట‌కు దూరంగా ఉన్నా ఆసియా క‌ప్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లిద్ద‌రూ ఎలా బ్యాటింగ్ చేస్తారు అన్న దానిపైనే ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి నెల‌కొంది. అయ్య‌ర్ త‌న‌కు అచ్చొచ్చిన నంబ‌ర్ 4 స్థానంలోనే బ్యాటింగ్ కు దిగనున్నాడు. త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల‌ని అత‌డు భావిస్తున్నాడు. కాగా.. ఐపీఎల్‌తో పాటు ఇటీవ‌ల ముగిసిన వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన తిల‌క్ వ‌ర్మ సైతం ఆసియా క‌ప్‌కు ఎంపిక అయ్యాడు. ఇత‌డు కూడా నంబ‌ర్ 4 స్థానానికి త‌గిన ఆట‌గాడ‌ని మాజీ లు అంటున్నారు.

Suryakumar Yadav: కోహ్లీతో రన్నింగ్ చేస్తున్న ఫొటో‌ను షేర్ చేసిన అనుష్క శర్మ.. సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర కామెంట్

అయితే.. తిలక్ వ‌ర్మ‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం అంత సుల‌భం కాదు. అయ్య‌ర్‌, రాహుల్‌ల‌లో ఎవ‌రైనా ఒక‌రు మ్యాచ్ ఆడ‌కుంటేనే తిల‌క్ వ‌ర్మ‌కు తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం ద‌క్కుతుంది. అక్క‌డ అత‌డు నిల‌క‌డైనా ప్ర‌ద‌ర్శ‌న చేస్తే ప్ర‌పంచ‌క‌ప్ బెర్తును సాధించ‌వ‌చ్చు. ప్ర‌పంచ‌క‌ప్ ముందు టీమ్ఇండియా ఆడ‌నున్న అతి పెద్ద టోర్నీ ఆసియా క‌ప్ మాత్ర‌మే. ఈ టోర్నీలోనే నంబ‌ర్ 4 స్థానంలో ఆడే ఆట‌గాడిపై అంచ‌నాకు రావాల్సిందే. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఫిట్‌గా లేకుంటే సూర్య‌కుమార్ యాదవ్‌, తిల‌క్ వ‌ర్మ‌ల‌లో ఎవ‌రికి ఛాన్స్ ద‌క్కుతుందో. మొత్తంగా నంబ‌ర్ 4 స్థానంలో ఆడే ఆట‌గాడు ఎవ‌రు అనేది ఆసియాక‌ప్‌తోనైనా క్లారిటీ వ‌స్తుందో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు