World Cup 2023 ENG vs BAN ODI : బంగ్లాదేశ్ పై ఇంగ్లండ్ ఘన విజయం

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తన రెండో మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ ను 137 పరుగుల తేడాతో ఓడించింది.

World Cup 2023 ENG vs BAN ODI Live Updates

బంగ్లాదేశ్ పై ఇంగ్లండ్ ఘన విజయం
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 137 పరుగుల తేడాతో ఇంగ్లండ్  ఘన విజయం సాధించింది. 365 పరుగుల భారీ టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటయింది. లిటన్ దాస్(76), ముష్ఫికర్ రహీమ్(51), తౌహిద్ హృదయ్(39) తప్ప మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో బంగ్లాదేశ్ కు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ 4, క్రిస్ వోక్స్ 2 వికెట్లు పడగొట్టారు.

 

45 ఓవర్లలో 220/8
బంగ్లాదేశ్ 45 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

ఓటమికి చేరువలో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ 6 వికెట్లు నష్టపోయి ఓటమికి చేరువలో నిలిచింది. టాపార్డర్ నలుగురు బ్యాటర్లు విఫలం కావడంతో కష్టాల్లో పడిన బంగ్లా టీమ్ లిటన్ దాస్(76), ముష్ఫికర్ రహీమ్(51) హాఫ్ సెంచరీలతో కోలుకుంది.
వీరిద్దరూ అవుటైన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 36 ఓవర్లలో 176/6 ఎదురీదుతోంది.

ముష్ఫికర్ రహీమ్ అవుట్
బంగ్లాదేశ్ వికెట్ల పతనం కొనసాగుతోంది. 164 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన ముష్ఫికర్ రహీమ్(51) అవుటయ్యాడు.

లిటన్ దాస్ అవుట్.. బంగ్లాదేశ్ ఐదో వికెట్ డౌన్
హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ ను ఆదుకున్న లిటన్ దాస్(76) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. 25 ఓవర్లలో 135/5 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

110 పరుగులు దాటిన బంగ్లాదేశ్ స్కోరు
లిటన్ దాస్(74), ముష్ఫికర్ రహీమ్(30) కీలక భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ కోలుకుంది. 20 ఓవర్లలో 117/4 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

లిటన్ దాస్ ఒంటరి పోరాటం
బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరో ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నా ఏమాత్రం జంకు లేకుండా
ఆట కొనసాగిస్తున్నాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ హాఫ్ సెంచరీ చేశాడు. 14 ఓవర్లలో 74/4 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే భారీ షాక్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తాంజిద్ హసన్(1), నజ్ముల్ హుస్సేన్ శాంటో(0), షకీబ్(1) అవుటయ్యారు. వీరు ముగ్గురినీ
రీస్ టాప్లీ అవుట్ చేశాడు.

బంగ్లాదేశ్ టార్గెట్ 365
బంగ్లాదేశ్ కు ఇంగ్లండ్ 365 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీషు టీమ్ 9 వికెట్లు నష్టపోయి 364 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలాన్ (140) సెంచరీతో చెలరేగిపోయాడు. జో రూట్(82), జానీ బెయిర్‌స్టో(52) హాఫ్ సెంచరీలు చేశారు. బట్లర్ 20, హ్యారీ బ్రూక్ 20, సామ్ కరన్ 11 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 4, షోరిఫుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టారు. షకీబ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ 47 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 20, సామ్ కర్రాన్ 11 పరుగులు చేసి అవుటయ్యారు.

జో రూట్, లివింగ్ స్టోన్ అవుట్
ఇంగ్లండ్ 307 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. జో రూట్(82), లివింగ్ స్టోన్(0) వెంట వెంటనే అవుటయ్యాడు. 44 ఓవర్లలో 323/5 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కంటిన్యూ చేస్తోంది.

బట్లర్ అవుట్.. ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్
296 పరుగుల వద్ద ఇంగ్లండ్ 3వ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ బట్లర్ 20 పరుగులు చేసి అవుటయ్యాడు. సెంచరీ హీరో డేవిడ్ మలాన్ 140 పరుగులు చేసి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 41 ఓవర్లలో 304/3 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కంటిన్యూ చేస్తోంది.

జో రూట్ కూడా హాఫ్ సెంచరీ
ఇంగ్లండ్ బ్యాటర్లు జోరు చూపిస్తున్నారు. జో రూట్ కూడా హాఫ్ సెంచరీ బాదాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో అర్ధ శతకం పూర్తి చేశాడు. డేవిడ్ మలాన్ 127 పరుగులతో ఆడుతున్నాడు.

 

డేవిడ్ మలాన్ సెంచరీ
ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ సెంచరీ సాధించాడు. 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం చేశాడు. వన్డేల్లో అతడికిది 6వ సెంచరీ. ఇంగ్లండ్ 32 ఓవర్లలో వికెట్ నష్టానికి 199 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ 101, జో రూట్ 44 పరుగులతో ఆడుతున్నారు.

175 పరుగులు దాటిన ఇంగ్లండ్ స్కోరు
ఇంగ్లండ్ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ 95, జో రూట్ 38 పరుగులతో ఆడుతున్నారు.

25 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 149/1
ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 149 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ 78, జో రూట్ 17 పరుగులతో ఆడుతున్నారు.

బెయిర్‌స్టో అవుట్.. ఇంగ్లండ్ ఫస్ట్ వికెట్ డౌన్
ఇంగ్లండ్ 17.5 ఓవర్లలో తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(52) షకీబ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఓపెనర్ల హాఫ్ సెంచరీలు
ఇంగ్లండ్ ఓపెనర్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ముందుగా డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీ చేయగా, తర్వాత జానీ బెయిర్‌స్టో కూడా అర్ధ శతకం సాధించాడు. బెయిర్‌స్టో 54 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. 17 ఓవర్లలో 113/0 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది.

డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీ
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ శతకం చేశాడు. జానీ బెయిర్‌స్టో 47 పరుగులతో ఆడుతున్నాడు.

World Cup 2023 ENG vs BAN ODI : వన్డే ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం ధర్మశాలలో జరుగుతున్న 7వ మ్యాచ్ లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్ జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

జట్లు
ఇంగ్లండ్
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

బంగ్లాదేశ్
తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్

ట్రెండింగ్ వార్తలు