World Cup 2023 ENG vs NZ : శ‌త‌కాల‌తో చెల‌రేగిన కాన్వే, ర‌వీంద్ర‌.. ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో న్యూజిలాండ్ జ‌ట్టు శుభారంభం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. 283 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 36.2 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది.

pic @ BLACKCAPS Twitter

World Cup 2023 England vs New Zealand : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో న్యూజిలాండ్ జ‌ట్టు శుభారంభం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. 283 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 36.2 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది. త‌ద్వారా 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డెవాన్ కాన్వే (152 నాటౌట్; 121 బంతుల్లో 19 ఫోర్లు, 3సిక్స‌ర్లు), రచిన్ రవీంద్ర (123 నాటౌట్; 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో సామ్‌క‌ర్ర‌న్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఆరంభంలోనే కివీస్ కు షాక్‌..

283 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన కివీస్ రెండో ఓవ‌ర్‌లోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. మంచి ఫామ్‌లో ఉన్న యువ ఆట‌గాడు విల్ యంగ్‌ను సామ్ కర్రాన్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో 10 ప‌రుగుల వ‌ద్ద కివీస్ మొద‌టి వికెట్ కోల్పోయింది. ఇక ఆ త‌రువాత ఇంగ్లాండ్‌కు సంతోషించ‌డానికి ఏమీ లేకుండా పోయింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన 23 ఏళ్ల ర‌చిన్ ర‌వీంద్ర ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు.

ఈ క్ర‌మంలో 36 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. క్ర‌మంగా జోరు పెంచిన కాన్వే సైతం 36 బంతుల్లో హాఫ్ శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. వీరిద్ద‌రు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ఏ మాత్రం లెక్క‌చేయ‌లేదు. అర్థ‌శ‌త‌కాల త‌రువాత మ‌రింత వేగం పెంచారు. పోటాపోటీగా బౌండ‌రీలు బాదారు. టీ20 త‌ర‌హాలోనే బ్యాటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో కాన్వే 83 బంతుల్లో, ర‌చిన్ ర‌వీంద్ర 82 బంతుల్లో సెంచ‌రీలు బాదారు. సెంచ‌రీ త‌రువాత కాన్వే మ‌రింత వేగంగా ఆడాడు. 119 బంతుల్లో 150 ప‌రుగులను పూర్తి చేసుకున్నాడు. వీరు ఇద్ద‌రే మ్యాచ్‌ను గెలిపించారు.

50 ఓవ‌ర్ల‌లో ఇంగ్లాండ్ 282/9..

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర‌లో జో రూట్ (77; 86 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (43; 42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జానీ బెయిర్ స్టో (33; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. డేవిడ్ మ‌ల‌న్ (14), మొయిన్ అలీ (11), లివింగ్ స్టోక్ (20) లు విఫ‌లం అయ్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ మూడు వికెట్లు తీయ‌గా మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ లు చెరో రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్డ్‌, రచిన్ రవీంద్ర లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

World Cup 2023 ENG vs NZ : ప్ర‌పంచ రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్‌.. 4,658 వన్డేల చరిత్రలో ఇదే తొలిసారి

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ కు జానీ బెయిర్ స్టో మొద‌టి ఓవ‌ర్‌లో అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. రెండో బంతికే సిక్స్ కొట్టిన బెయిర్ స్టో ఐదో బంతికి ఫోర్ కొట్ట‌డంతో మొద‌టి ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. బెయిర్ స్టో అదే దూకుడు కొన‌సాగించ‌డ‌గా మ‌రో ఓపెన‌ర్ డేవిడ్ మ‌ల‌న్ తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాడు. క్రీజులో అసౌక‌ర్యంగా క‌నిపించిన అత‌డు మాట్ హెన్రీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో ఎనిమిదో ఓవ‌ర్‌లో 40 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఆదుకున్న జో రూట్‌..

దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టోకు శాంట‌ర్న్ అడ్డుక‌ట్ట వేయ‌గా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న హ్యారీ బ్రూక్‌ను ర‌చిన్ ర‌వీంద్ర‌, మొయిన్ అలీను గ్లెన్ ఫిలిఫ్స్‌లు పెవిలియ‌న్‌కు చేర్చ‌డంతో ఇంగ్లాండ్ 118 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో కెప్టెన్ బ‌ట్ల‌ర్‌తో జ‌త‌క‌లిసిన వ‌న్ డౌన్ బ్యాట‌ర్ జో రూట్ జ‌ట్టును ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్టాడు. ఈ క్ర‌మంలో 57 బంతుల్లో జో రూట్ అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని జోస్ బ‌ట్ల‌ర్‌ను ఔట్ చేయ‌డం ద్వారా మాట్ హెన్రీ విడ‌గొట్టాడు. జోరూట్‌-బ‌ట్ల‌ర్ జోడి ఐదో వికెట్‌కు 70 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. కాసేప‌టికే లివింగ్ స్టోన్‌, జో రూట్‌లు పెవిలియ‌న్‌కు చేర‌డంతో వికెట్ల ప‌త‌నం వేగంగా సాగింది. అయితే.. ఆఖ‌ర్లో ఆదిల్ ర‌షీద్ (15 నాటౌట్‌), మార్క్ వుడ్ (13నాటౌట్ ) ప‌దో వికెట్‌కు 30 ప‌రుగుల భాగ‌స్వామ్యంతో జ‌ట్టుకు పోరాడే స్కోరును అందించాడు.

ODI World Cup 2023 : క్రికెట్ లవర్స్‌కు పండుగే.. సరికొత్త ఫీచర్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. వన్డే ప్రపంచ కప్‌ 2023 స్ట్రీమింగ్ ఇలా చూడొచ్చు!

ట్రెండింగ్ వార్తలు