Yashasvi Jaiswal : డ్రీమ్ హౌస్‌లో అడుగుపెట్టిన య‌శ‌స్వి జైస్వాల్‌.. నా కొత్త ఇల్లు.. అద్భుత‌మైన ఇల్లు..

టీమ్ఇండియా యువ ఆటగాడు య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇటీవ‌ల త‌న కుటుంబంతో క‌లిసి ముంబైలోని త‌న కొత్త ఇంటికి మకాం మార్చాడు.

Yashasvi Jaiswal new house

Yashasvi Jaiswal new house : టీమ్ఇండియా యువ ఆటగాడు య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇటీవ‌ల త‌న కుటుంబంతో క‌లిసి ముంబైలోని త‌న కొత్త ఇంటికి మకాం మార్చాడు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నూత‌న ఇంటిలో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు.

‘నా కొత్త ఇల్లు. అద్భుత‌మైన ఇల్లు. ఇప్పుడు ఇందులో నివ‌సించ‌డం నాకు చాలా ఇష్టం. మ‌కాస్సా స్టూడియోకి చెందిన ఆర్కిటెక్ట్ మీన‌ల్ విచారే అద్భుత‌మైన డిజైన్లు రూపొందించారు. డిజైన్ నుంచి ఇంటీరియ‌ర్ వ‌ర‌కు ప్ర‌తీది చాలా బాగుంది. మ‌కాస్సా బృందానికి నా, నా కుటుంబం త‌రుపున కృత‌జ్ఞ‌త‌లు.’ అంటూ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు య‌శ‌స్వి జైస్వాల్.

Asia Cup 2023 : మ్యాచ్ మ‌ధ్య‌లో ఆగిన ఫ్ల‌డ్ లైట్లు.. టోర్నీ మొత్తం చీక‌ట్లోనే ఆడించేవాళ్లా..?

దేశ‌వాళీ క్రికెట్‌తో పాటు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (IPL)లో నిల‌క‌డ‌గా రాణించ‌డంతో టీమ్ఇండియాకు ఎంపిక‌య్యాడు జైస్వాల్‌. గ‌త నెల వెస్టిండీస్‌లో ప‌ర్య‌టించాడు. ఈ క్ర‌మంలో టెస్టులు, టీ20ల్లో టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేటం చేశాడు. రెండు ఫార్మాట్ల‌లోనూ అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. డొమినికా వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టులో ఈ ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ 171 ప‌రుగులు చేశాడు. మొత్తంగా రెండు టెస్టు మ్యాచుల్లో 266 ప‌రుగులు చేశాడు.

Shahid Afridi: గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీ .. ఏమన్నాడంటే..

ఇక మూడు టీ20 మ్యాచులు ఆడ‌గా 157.89 స్ట్రైక్ రేటుతో 90 ప‌రుగులు చేశాడు. కాగా.. ఆసియాక‌ప్‌, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో చోటు ద‌క్కించుకోలేక‌పోయిన ఈ 22 ఏళ్ల ఆట‌గాడు ఆసియా క్రీడ‌ల కోసం ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్నాడు. ఐపీఎల్ 2023 కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు అత‌డిని రూ.4 కోట్ల‌కు రిటైన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు