Hazel Keech : యువరాజ్ సింగ్ క్యాన్సర్ తరువాత.. అతడి భార్య తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా..?

యువరాజ్ సింగ్ భార్య హేజెల్ కీచ్ తన జుట్టుని దానం ఇచ్చారు. అయితే తను ఈ పని చేయడం వెనుక ప్రేరణ కలిగించిన అంశాలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు.

Hazel Keech

Hazel Keech : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హేజెల్ కీచ్ మోడల్‌గా, నటిగా అందరికీ సుపరిచితమే. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ‌ఉంటారు. రీసెంట్‌గా తన జుట్టును దానం చేసారు. తను హెయిర్ కట్ చేసిన ఫోటోతో పాటు తను ఎందుకు అలా చేయాలనుకున్నానో వివరిస్తూ హేజెల్ కీచ్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Ankur Warikoo : సోషల్ మీడియాలో తన ‘ఫెయిల్యూర్ రెజ్యూమ్’ పంచుకున్న యూట్యూబర్, రచయిత అంకుర్ వారికూ

యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్ దంపతులు ఆగస్టులో రెండవ బిడ్డకు జన్మనిచ్చారు. రీసెంట్‌గా హేజెల్ కీచ్ డెలివరీ తరువాత ఎదురయ్యే సమస్యల్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. క్యాన్సర్ నుంచి బయటపడిన పిల్లల విగ్గుల కోసం తన జుట్టును దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రసవానంతరం చాలామంది స్త్రీలు జుట్టు కట్ చేసుకోవడం గమనించానని అప్పుడు తనకు అర్ధం కాలేదని.. తనకు డెలివరీ అయిన తరువాత ఆ సమస్య అర్ధమైందని ఆమె పేర్కొన్నారు.

Inspirational Story of Bharathi : కూలి పని చేస్తూ కెమెస్ట్రీలో PHD చేసిన సాకే భారతి స్ఫూర్తివంతమైన కథ

క్యాన్సర్ పేషెంట్స్‌కి తయారు చేసే విగ్గుల కోసం తను సహకరించాలని అనుకుంటున్నానని.. ఈ నిర్ణయం తన భర్త యువరాజ్ సింగ్ నుంచి ప్రేరణ పొందానని హేజెల్ కీచ్ చెప్పుకొచ్చారు. యువరాజ్ సింగ్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ సమయంలో జుట్టు రాలడం వల్ల కలిగే బాధని అనుభవించారని ఆ సమయంలో వారి ఆత్మగౌరవాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో గ్రహించానని హేజెల్ కీచ్ చెప్పారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లిటిల్ ప్రిన్సెస్ ట్రస్ట్‌కి తన జుట్టును దానం చేస్తున్నట్లు హేజెల్ కీచ్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు