Amazon Prime: డిసెంబర్ 13వ తేదీలోపు అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ ఇదే!

అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేందుకు చూస్తున్నారా? అయితే, డిసెంబర్ 13వ తేదీ లోపు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోండి లేకుండా మీరు తర్వాత ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

Amazon Prime: అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేందుకు చూస్తున్నారా? అయితే, డిసెంబర్ 13వ తేదీ లోపు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోండి లేకుండా మీరు తర్వాత ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. డిసెంబర్ 13వ తేదీకి ముందు కేవలం 999 రూపాయలకే మీరు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

నెలవారీ, మూడు నెలల ప్లాన్‌‌తో సహా వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ధరలు కూడా పెంచాలని నిర్ణయించుకుంది అమెజాన్. అందుకే, అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పొందాలంటే డిసెంబర్ 13 తేదీ లోపల సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.

ఇప్పటివరకూ చవక ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తున్న సంస్థగా అమెజాన్ ఉంది. ఎందుకంటే, కేవలం రూ. 999 రూపాయలకే అమెజాన్ సబ్ స్క్రిప్షన్ వచ్చేస్తోంది. దీనితో, అద్భుతమైన స్ట్రీమింగ్‌, ఉచిత డెలివరీ సర్వీస్ అవకాశం లభిస్తోంది. కానీ, ఈ ధర వద్ద నెట్‌ఫ్లిక్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు కస్టమర్లకు ఇలాంటి సేవలను అందించట్లేదు.

Earthquake: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. భూమిలోంచి భారీ శబ్ధాలు

అమెజాన్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్లాన్ అప్‌‌‌డేట్ అయ్యాక మూడు నెలల సబ్ స్క్రిప్షన్ రూ .329కి బదులుగా రూ.459 అవుతోంది. నెలవారి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రూ.129 కి బదులుగా 179 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త ధరలను అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ 14వ తేదీ నుంచి అమలు చేస్తుంది.

ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ సంవ‌త్స‌రానికి రూ.999గా ఉంది. అయితే, ఈ ధ‌ర డిసెంబ‌ర్ 13 త‌ర్వాత రూ.1499 కానుంది. అంటే 500 రూపాయ‌లు ఎక్కువ అన్న‌మాట‌. అంటే సుమారుగా 50 శాతం ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ధ‌ర‌ను పెంచేసింది అమెజాన్. అయితే, ఇప్పుడు తీసుకుంటే మాత్రం.. ఆమేర డబ్బులు తగ్గనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు