Port to Airtel : మీ ఫోన్ నెంబర్ మార్చకుండానే ఎయిర్‌టెల్‌కు ఈజీగా పోర్ట్ కావొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Port to Airtel : మీకు రిలయన్స్ జియో (Reliance Jio) లేదా వోడాఫోన్ నంబర్ (Vodafone) ఉందా? అయితే మీ ఫోన్ నెంబర్ మార్చకుండానే ఎయిర్‌టెల్‌ (Airtel)కు మారాలనుకుంటున్నారా?

Port to Airtel : మీకు రిలయన్స్ జియో (Reliance Jio) లేదా వోడాఫోన్ నంబర్ (Vodafone) ఉందా? అయితే మీ ఫోన్ నెంబర్ మార్చకుండానే ఎయిర్‌టెల్‌ (Airtel)కు మారాలనుకుంటున్నారా? టెలికాం ఆపరేటర్ సులభమైన పోర్టబిలిటీ సర్వీసును అందిస్తోంది. దీని ద్వారా మీరు ఇప్పటికే ఉన్న మీ మొబైల్ నంబర్‌ను మార్చకుండానే Jio లేదా Vi నుంచి Airtelకి మారవచ్చు. ఏదైనా నంబర్‌ను Airtelకి పోర్ట్ చేయడం చాలా సులభం.

మీ SIMను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌కు పోర్ట్ చేసేందుకు మీ ఆధార్ కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర వ్యాలిడిటీ అయ్యే ID ప్రూఫ్ అవసరం పడుతుంది. అధికారిక వెబ్‌సైట్‌లో Airtel మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ఒకటి లేదా రెండు రోజులు పడుతుందని పేర్కొంది.

మీ ప్రస్తుత ఆపరేటర్‌ను Airtelకి పోర్ట్ చేయాలనుకుంటే.. మీరు ఈ కింది విధంగా ఫాలో కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా, Jio, Vi, BSNL ఇతరులతో సహా యూజర్లందరూ మొబైల్ నంబర్‌ను మార్చకుండానే ఎయిర్‌టెల్‌కి తమ నెట్‌వర్క్‌ను పోర్ట్ చేసుకోవచ్చు.

How to apply for passport online on Passport Seva portal

ఫోన్ నంబర్ మార్చకుండా Airtelకి పోర్ట్ చేయడం ఎలా :

* అధికారిక Airtel వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు.
* మెను నుంచి Airtel ప్రీపెయిడ్ ఎంపికపై క్లిక్ చేసి, Port to Airtel ప్రీపెయిడ్ ఎంచుకోండి.
* ఇప్పుడు, MNP ప్రక్రియను ప్రారంభించడానికి Airtel అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోండి.
* ప్లాన్‌లు రూ. 299 నుండి ప్రారంభమవుతాయి.
* ఆ తర్వాత, ఫారమ్‌ను పూరించడం ద్వారా డోర్‌స్టెప్ KYCని షెడ్యూల్ చేయండి.
* స్థలంలో పేరు, అడ్రస్, మీరు పోర్ట్ చేయాలనుకునే ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయండి.

Note : SIM కార్డ్‌తో నమోదు చేసుకున్న వ్యక్తి పేరును నమోదు చేయండి.

* అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత Submitపై క్లిక్ చేయండి.
* Airtel ఎగ్జిక్యూటివ్ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేందుకు మీ ఇంటి వద్దకే SIMని డెలివరీ చేయడానికి కాల్‌లో మిమ్మల్ని సంప్రదిస్తారు.
* మీరు డెలివరీ సమయంలో Airtel నుంచి అందుకున్న మీ ID ప్రూఫ్, 8 అక్షరాల యునిక్ పోర్టింగ్ కోడ్ (UPC)ని షేర్ చేయాలి.
* ముఖ్యంగా, ప్రక్రియ 2 రోజుల్లో లేదా 48 గంటల్లో పూర్తవుతుంది.
* సిమ్ డెలివరీ చేసిన తర్వాత.. మీరు మీ SIM డెలివరీ చేసే ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌కు రూ. 100 రుసుమును చెల్లించాలి.
* మీ MNP ప్రక్రియను Airtel థాంక్స్ యాప్‌లో ట్రాక్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది.
* మీరు మీ పోర్ట్-ఇన్ నంబర్‌ని ఉపయోగించి యాప్‌లోకి సైన్ ఇన్ చేయాలి.
* ఈ ప్రక్రియ హార్డ్ అనిపిస్తే.. మీరు మీ మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేసేందుకు మీ సమీప Airtel స్టోర్‌కు వెళ్లవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apply Passport Online : విదేశాలకు వెళ్లేందుకు మీకు పాస్‌పోర్టు లేదా? ఇలా సింపుల్‌గా అప్లయ్ చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు