WhatsApp View Once Mode : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ నోట్స్ కోసం ‘వ్యూ వన్స్’ మోడ్ ఇదిగో..!

WhatsApp View Once Mode : వాట్సాప్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. వాయిస్ నోట్స్ కోసం ‘వ్యూ వన్స్ మోడ్’ ఫీచర్ రిలీజ్ చేస్తోంది.

WhatsApp View Once Mode : పాపులర్ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ పాస్‌కీ (Whatsapp Passkey)లకు సపోర్టును అందించింది. ఈ వారం ప్రారంభంలో బాటమ్ ట్యాబ్ ఇంటర్‌ఫేస్‌ ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్, iOS, Android రెండింటిలోనూ యూజర్‌లు వాయిస్ నోట్‌లను (View Once for Voice Notes) అని సెట్ చేసేందుకు అనుమతించే ఫీచర్‌ను విడుదల చేస్తోంది. వాట్సాప్ ఇప్పటికే ఇతర రకాల మీడియాలను అనుమతిస్తుంది. రాబోయే ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. రాబోయే రోజుల్లో వైడ్ యూజర్‌బేస్ కోసం అందుబాటులోకి వస్తుంది.

ఫొటోలు, వీడియోల మాదిరిగానే :

వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ (WABetaInfo) నివేదిక ప్రకారం.. యాప్ బీటా యూజర్లకు కొత్త ప్రైవసీ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. సెల్ఫ్-డిస్ట్రింగ్ వాయిస్ నోట్‌లను తీసుకువస్తోంది. వాట్సాప్ యూజర్లను యాప్‌లోని వారి కాంటాక్టులకు ఫొటోలు, వీడియోలను పంపుతున్నప్పుడు ‘వ్యూ వన్స్‘ ఆప్షన్ ఇప్పటికే ఎంచుకోవచ్చు. అదే ఫీచర్ వాయిస్ నోట్స్‌కు కూడా రానుంది.

Read Also : Whatsapp Passwordless Key : వాట్సాప్‌‌‌లో కొత్త ఫీచర్.. పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఎనేబుల్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటాలో బీటా టెస్టర్‌లను, టెస్ట్ ఫ్లైట్ యాప్ ద్వారా iOS కోసం వాట్సాప్ బీటాను ఎంచుకోవడానికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ 2.23.21.15, 2.23.22.4 కోసం వాట్సాప్ బీటా ఆడియో మెసేజ్‌ల కోసం ‘View Once’ మోడ్ ఫీచర్‌కు అనుకూలమైన అప్‌డేట్‌లు ఉన్నాయి. iOSలో, వాట్సాప్ బీటా 23.21.1.73 అప్‌డేట్‌కు అనుకూలంగా ఉన్నట్లు నివేదించింది.

WhatsApp View Once Mode for Voice Notes

వాయిస్ నోట్స్ ఎనేబుల్ చేస్తే.. :

ముందే చెప్పినట్లుగా.. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో అందరి యూజర్లకు అందుబాటులోకి రానుంది. ‘వ్యూ వన్స్’ మోడ్ ఆన్‌లో ఉన్న వాయిస్ నోట్‌లు సేవ్ కావని గమనించాలి. లేదా ఇతర వినియోగదారులకు ఫార్వార్డ్ చేయడం కుదరదు. (WABetaInfo) కూడా టెస్టింగ్‌లో ఫీచర్ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. వాయిస్ మెసేజ్ చాట్ బార్‌లో తెలిసిన ‘వ్యూ వన్స్’ ఐకాన్ చూపుతుంది. ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా వాయిస్ నోట్ ‘వ్యూ వన్స్’ మోడ్‌లో పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాత పంపిన వాయిస్ నోట్‌ని మళ్లీ ప్లే చేయడం, సేవ్ చేయడం లేదా షేర్ చేయడం సాధ్యపడదు.

ఆండ్రాయిడ్ ఫోన్లలో పాస్‌కీ సపోర్టు :
వాట్సాప్ ఇటీవలి కాలంలో ప్రైవసీ ఫీచర్లను క్రమంగా ప్రవేశపెడుతోంది. యాప్ లాక్ చేసిన చాట్‌ల కోసం కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌పై పనిచేస్తోందని తెలిపింది. వినియోగదారులు తమ ప్రొటెక్షన్ చాట్ ఫోల్డర్‌లకు సపోర్టెడ్ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ వారమే వాట్సాప్ ఆండ్రాయిడ్‌లో పాస్‌కీ ( Whatsapp Login Passkey) సపోర్టును అందించింది.

బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా డివైజ్ పిన్‌ని ఉపయోగించి అకౌంట్లలో తిరిగి లాగిన్ అవ్వడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ డివైజ్‌లో స్టోర్ చేసిన పాస్‌కీతో వాట్సాప్ అకౌంట్లకు తిరిగి లాగిన్ చేయడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఫేస్ అన్‌లాక్ లేదా ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ను ఉపయోగించవచ్చు.

Read Also : Oppo Find N3 Launch : ఒప్పో కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ మడతబెట్టే ఫోన్ ఫీచర్లు, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు