CWC Meeting Hyderabad: సీడబ్ల్యూసీ సమావేశాలు తొలిరోజు ముగింపు

హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణా వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హైదరాబాద్‌ చేరుకున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 16 Sep 2023 07:16 PM (IST)

    సీడబ్ల్యూసీ సమావేశం తొలిరోజు ముగింపు

    దేశ రాజ్యాంగం, సమాఖ్య విధానానికి సవాళ్లు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం అన్నారు. సమాఖ్య విధానాన్ని క్రమంగా బలహీనపర్చుతున్నారని చెప్పారు.

    సీడబ్ల్యూసీ సమావేశం తొలి రోజు ముగిసింది. అనంతరం పలువురు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

  • 16 Sep 2023 05:51 PM (IST)

    నోరూరించే రుచులు

    సీడబ్ల్యూసీ ముగిసిన తర్వాత ఇవాళ రాత్రి ఇచ్చే విందు కోసం నోరూరించే రుచులతో అనేక రకాల వంటకాలు సిద్ధం చేశారు. తాజ్ కృష్ణాలో 300 మంది భోజనం చేయనున్నారు.

  • 16 Sep 2023 04:36 PM (IST)

    హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు

  • 16 Sep 2023 04:25 PM (IST)

  • 16 Sep 2023 04:03 PM (IST)

    రాత్రి 7 గంటల వరకు..

    సీడబ్ల్యూసీ సమావేశాలు తొలిరోజు రాత్రి 7 గంటలకు ముగుస్తాయి. ఆ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ అలాగే డిన్నర్ ఉంటుంది. రేపు ఉదయం 10:30 గంటలకు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం అవుతుంది.

  • 16 Sep 2023 03:21 PM (IST)

    సీడబ్ల్యూసీ సమావేశాలు షురూ

    ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జెండా ఎగరేసి.. సీడబ్ల్యూసీ సమావేశాలను ప్రారంభించారు.

  • 16 Sep 2023 01:38 PM (IST)

    తాజ్ కృష్ణకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. మల్లికార్జున ఖర్గే.

    ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నేతలు

  • 16 Sep 2023 01:07 PM (IST)

    సిడబ్ల్యుసి వర్కింగ్ కమిటీ సమావేశానికి విచ్చేసిన నేతలను శంషాబాద్ ఏర్పాటులో రిసీవ్ చేరుకున్న కేసి వేణుగోపాల్, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఠాక్రే, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి..

  • 16 Sep 2023 01:05 PM (IST)

    శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ. ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన రేవంత్, మాణిక్ రావ్ ఠాక్రే తదితరులు

  • 16 Sep 2023 11:57 AM (IST)

    రాహుల్ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది.

    తాజ్ కృష్ణ మీడియా పాయింట్ వద్ద CWC మెంబర్ పవన్ ఖేరా మాట్లాడారు.. దేశ ప్రజలంతా హైదరాబాద్‌వైపు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని, రాహుల్ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిని ఎన్నికకూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకుంటామని చెప్పారు.  CWC సమవేశాల్లో కీలకమైన అంశాలను చర్చిస్తామని అన్నారు. మేం ఏ జర్నలిస్ట్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదు. విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళని దూరంపెట్టాలని అనుకున్నామని పవన్ ఖర్గే అన్నారు.

  • 16 Sep 2023 11:43 AM (IST)

    Cwc సమావేశానికి వచ్చే సభ్యులకు రాత్రి కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటుతో పాటు, భారత్ జోడో యాత్ర‌కు సంబందించిన చిత్రాలతో ఫోటో ఎగ్జిబిషన్‌నుకూడా ఏర్పాటు చేశారు.

  • 16 Sep 2023 11:23 AM (IST)

    సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చే అతిథులకు తెలంగాణ సంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకుతున్న టీ కాంగ్రెస్.. కోయలతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే సీతక్క.

  • 16 Sep 2023 11:21 AM (IST)

    ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ‌లకు స్వాగతం పలికేందుకు తాజ్‌కృష్ణ నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు బయలుదేరిన కేసీ వేణుగోపాల్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

  • 16 Sep 2023 10:32 AM (IST)

    రేపు ఉదయం 10.30 గంటలకు ఎక్స్‌టెండెడ్ డబ్ల్యూసీ సమావేశం.

  • 16 Sep 2023 10:31 AM (IST)

    మధ్యాహ్నం 2గంటలకు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

  • 16 Sep 2023 10:30 AM (IST)

    మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ

  • 16 Sep 2023 10:27 AM (IST)

    CWC సమావేశం కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ

  • 16 Sep 2023 10:26 AM (IST)

    హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ రానున్నారు. నగరంలోని హోటల్ తాజ్‌కృషా వేదికగా శనివారం, ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలకోసం హోటల్ తాజ్ కృష్ణలో భారీగా ఏర్పాట్లు చేశారు. సమావేశాలు ముగిసిన తరువాత తుక్కుగూడలో ఆదివారం జరిగే భారీ బహిరంగ సభలో సోనియా, రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు.

ట్రెండింగ్ వార్తలు