Ponnala Lakshmaiah: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది.మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

Ponnala Lakshmaiah Resigned From Congress

Ponnala Lakshmaiah Resigned Congress : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పొన్నాల తన రాజీనామా లేఖను పంపించారు. జనగామ టికెట్ ఆశించిన పొన్నాల అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో పొన్నాల నీటి పారుదల శాఖామంత్రిగా పనిచేశారు. అలాగే గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

కాగా.. పొన్నాల రాజీనామా చేసిన క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. ఫోన్ లో మాట్లాడేందుకు యత్నిస్తే కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు రేవంత్ సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని సీట్లు కేటాయిస్తున్నారనే వస్తున్న వార్తల్ని పొన్నాల ప్రస్తావించారు. బీసీ నేతలను ఓడిపోయేవారిగా చిత్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీలో కొత్తగా వచ్చినవారికి ఇస్తున్న ప్రాధాన్యత సీనియర్లకు ఇవ్వటం లేదంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాగా పొన్నాల బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీంట్లో నిజమెంత..? అనే విషయం తెలియాల్సి ఉంది.

Also Read : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. బీఆర్ఎస్ లో చేరిన పట్లోళ్ల శశిధర్ రెడ్డి

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి కూడా ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. కాగా.. తెలంగాణలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కర్ణాటకలో జరిగిందే తెలంగాణలోనూ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కు వరుస షాకులిస్తున్నారు నేతలు.

ట్రెండింగ్ వార్తలు