Karimnagar Death Mystery : అంతుచిక్కని వ్యాధీ కాదు, చేతబడీ కాదు.. కరీంనగర్‌లో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు..!

కరీంనగర్ జిల్లా గంగాధరలో సంచలనం రేపిన ముగ్గురి డెత్ మిస్టరీ దాదాపు ఛేదించారు పోలీసులు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధితో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారు. ముగ్గురూ ఒకే రకమైన లక్షణాలతో చనిపోవడం కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగిన మృతుల శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు.

Karimnagar Death Mystery : కరీంనగర్ జిల్లా గంగాధరలో సంచలనం రేపిన ముగ్గురి డెత్ మిస్టరీ దాదాపు ఛేదించారు పోలీసులు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధితో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారు. ముగ్గురూ ఒకే రకమైన లక్షణాలతో చనిపోవడం కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగిన మృతుల శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు.

భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత శ్రీకాంత్ కూడా చనిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకునే ముందు ఇచ్చిన క్లూ ఆధారంగా పోలీసులు కేసుని చేధించే పనిలో నిమగ్నమయ్యారు. గంగాధరలో 33 రోజుల వ్యవధిలో తల్లి మమత, ఇద్దరు పిల్లలు అమూల్య(6), అద్వైత్(2) రక్తపు వాంతులు చేసుకుని మృతి చెందారు. అసలు ఈ ముగ్గురూ ఎలా చనిపోయారు అన్నది ఎవరికీ అంతు చిక్కలేదు. దీంతో ఇది అంతు చిక్కని వ్యాధి అని భావించారు. మరికొందరు చేతబడి వల్లే చనిపోయారు అని అనుమానాలు వ్యక్తం చేశారు.

Also Read..Terminal Disease Four Died : కరీంనగర్ జిల్లాలో అంతు చిక్కని వ్యాధి.. నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ముగ్గురి మరణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ మమత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల శరీర అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి పరీక్షలు చేయిస్తున్నారు.

ఓవైపు విచారణ జరుగుతున్న క్రమంలో మమత భర్త శ్రీకాంత్ డిసెంబర్ 30న సూసైడ్ చేసుకున్నాడు. NAOH గా పిలిచే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రీకాంత్ చెప్పాడు. దీంతో శ్రీకాంత్ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ తో శ్రీకాంతే ముగ్గురినీ చంపి ఉంటాడనే కోణంలో దర్యాఫ్తు ముమ్మరం చేశారు పోలీసులు.

Also Read..Teacher Misbehave : తాకరాని చోట తాకే వాడు, ఫోన్ జేబులో పెట్టాలని చెప్పేవాడు.. కాకినాడ జిల్లాలో కీచక టీచర్

సోడియం హైడ్రాక్సైడ్ గురించి శ్రీకాంత్ కు ఎలా తెలుసు అని పోలీసులు ముందుగా విచారణ జరిపారు. శ్రీకాంత్ ఎంఎస్సీ బయోటెక్నాలజీలో పీజీ చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ సైన్స్ లెక్చరర్ గా కూడా పని చేశాడు. దీంతో కెమికల్స్ ఎలా పని చేస్తాయి అనే దానిపై ఆయనకు అవగాహన ఉంది. దీంతో శ్రీకాంత్ తన భార్య ఇద్దరు పిల్లలపైన రసాయన ప్రయోగం చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోడియం హైడ్రాక్సైడ్ ను ఏ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్య, పిల్లలపై ఎందుకు రసాయన ప్రయోగం చేశాడు అనేది మిస్టరీగా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సోడియం హైడ్రాక్సైడ్ ప్రమాదకరమైన రసాయన సమ్మేళనం అని కెమికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఈ రసాయనం మోతాదుకి మించి మనిషి శరీరంలోకి వెళితే.. కిడ్నీలు, కాలేయంతో పాటు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. రోజుల వ్యవధిలో మనిషి చనిపోతాడు.

33 రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి..
తొలుత అద్వైత్‌ (20 నెలలు) వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యాడు. ముందుగా కరీంనగర్‌ లో చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్‌ తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. నవంబర్ 16న అద్వైత్‌ మృతి చెందాడు. నవంబర్ 29న అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 1న చనిపోయింది. ఈ రెండు మరణాలకు కారణాలు చెప్పలేకపోయారు డాక్టర్లు.

14 రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు దూరం కావడంతో శ్రీకాంత్‌ భార్య మమత (26) తల్లడిల్లిపోయింది. ఆమె కూడా డిసెంబర్ 15న సడెన్ గా అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 18న మరణించింది. దీంతో మమత కుటుంబ సభ్యుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కేవలం 33 రోజుల్లో ఒకే కుటుంబంలో మూడు మరణాలు సంభవించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు శ్రీకాంత్‌ ఇంటి సమీపంలోని బావి నీళ్లను, బంధువుల రక్త నమూనాలను పరీక్షిస్తే వాటిలో ఏమీ తేలలేదు. ఈ మరణాలపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కుటుంబానికి చేతబడి చేశారని కొందరు, అంతుచిక్కని వ్యాధి వచ్చిందని రకరకాలుగా చెప్పుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు