Constable Kistaiah Family : తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ మరోసారి ఆర్థిక సాయం చేశారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో ఆ కుటుంబానికి అండగా ఉంటానని కేసీఆర్ అప్పట్లో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను బీఆర్ఎస్ అధినేత నిలబెట్టుకున్నారు. కిష్టయ్య మరణంతో ఆయన కుమారుడు, కూతురిని కేసీఆర్ చదివిస్తున్నారు.
Read Also : Chiranjeevi – Ram Charan : ‘విశ్వంభర’ సెట్‌లో రామ్ చరణ్.. తండ్రి కొడుకుల మధ్య స్టార్ సినిమాటోగ్రాఫర్..
ఇప్పటికే ఎంబీబీఎస్ చదివించిన కేసీఆర్ కిష్ణయ్య కుమార్తె ప్రియాంక పీజీ కోర్సు వైద్యవిద్యకి కూడా ఆర్థిక మద్దతు అందించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుకుంటోంది. అయితే, నంది నగర్‌లో కిష్టయ్య కుటుంబాన్ని కలిసిన కేసీఆర్ వారితో కలిసి భోజనం చేశారు.
Read Also : ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కేసీఆర్ అమ్మను కష్టపెట్టకుండా చూసుకోండంటూ కిష్టయ్య పిల్లలకు బాధ్యతను గుర్తు చేశారు. అమరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడిందని ఆయన పునరుద్ఘాటించారు. కేసీఆర్ మమ్మల్ని ఆదుకుంటూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, తమను కంటికి రెప్పలా కాపాడుతున్నరని కిష్టయ్య కొడుకు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్‌కు కిష్టయ్య కుటుంబం ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలిపింది.
కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్య కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్థికసాయం
?ఎంబీబీఎస్ చదివించిన కేసీఆర్ గారు పీజీ కోర్సుకు కూడా ఆర్థిక మద్దతు
? కిష్టయ్య కుటుంబంతో కలిసి భోజనం చేసిన కేసీఆర్
? కుటుంబ బాగోగుల పరామర్శ.. https://t.co/zW26IkF7Eb pic.twitter.com/6rpng9Z6p6— BRS Party (@BRSparty) June 2, 2024