Kantareddy Tirupati Reddy : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను కాంగ్రెస్ బలవంతంగా బయటికి పంపించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. Kantareddy Tirupati Reddy

Kantareddy Tirupati Reddy (Photo : Twitter X)

Kantareddy Tirupati Reddy – BRS : ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు. హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కుతున్నారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు మరో డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ను వీడారు.

మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె. తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్డీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి తన క్యాడర్ తో పాటు వస్తున్న తిరుపతి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం పలికారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో చేరడం స్వాగతించదగిన విషయం అన్నారు. తిరుపతి రెడ్డితో పాటు బీఆర్ఎస్ లో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తామన్నారు.

Also Read : ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం అదేనా?

బీఆర్ఎస్ అసంతృప్త నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం చిచ్చు రాజేసింది. మైనంపల్లి రాకను కొందరు కాంగ్రెస్ కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉండగా కేసుల పెట్టి కాంగ్రెస్ నేతలను వేధించిన మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా రెండు టికెట్లు ఇవ్వడాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నారు.

మల్కాజ్ గిరి టికెట్ మైనంపల్లి హనుమంతరావుకి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకోవడంతో మల్కాజ్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. మైనంపల్లి చేరిక వ్యవహారంలో.. ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని అసలు సంప్రదించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు.

Also Read : ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టడంతో.. టెన్షన్ పడుతున్న ఎంపీ దయాకర్‌!

పార్టీ పెద్దలు ఎవరూ తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న వేదన ఆ ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కారణమైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో కొందరు నేతలు చేరితే బలం పుంజుకున్నామని అనుకుంటే.. ఉన్న నేతలను కాపాడుకోలేకపోవడం బలహీనతే అంటున్నారు కాంగ్రెస్ లాయలిస్టులు.

ట్రెండింగ్ వార్తలు