Revanth Reddy: చనిపోయిన ఆడపిల్లపై అభాండాలు వేస్తున్నారు: రేవంత్ రెడ్డి

గతంలో 30 మంది ఇంటర్ విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో..

Revanth Reddy

Pravalika Case: ప్రవళిక ఆత్మహత్య విషయంలో తప్పుడు అంశాలను జోడిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చనిపోయిన ఆడపిల్లపై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ప్రవళిక మృతిపై స్పందించారు. ప్రవళిక ఆత్మహత్యపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పారు. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు.

ఉద్యోగాల పోటీ పరీక్షలు నిర్వహించలేకపోయారని చెప్పారు. గతంలో 30 మంది ఇంటర్ విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో యువత ఆందోళనలో ఉందని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ, పార్టీ ఫిరాయింపులు, ఎన్నికల ప్రచారంపైనే దృష్టి పెట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. రెండు నెలలు ఓపిక పట్టాలని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.

ప్రభుత్వం ఏర్పడిన రోజే గ్యారెంటీలపై సంతకాలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. వామపక్షాలతో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ నెల 18 నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారని చెప్పారు. వారి పర్యటన షెడ్యూల్ ఆదివారం అధికారికంగా వెల్లడిస్తామని అన్నారు.

Bandi Sanjay: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఇక లేఖలు సృష్టిస్తారు: బండి సంజయ్

ట్రెండింగ్ వార్తలు